హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్! | Actress Pooja Hegde Knee Injury Pic Goes Viral | Sakshi
Sakshi News home page

Pooja Hegde: గాయపడ్డ పూజాహెగ్డే.. అలా చేస్తుండగా దెబ్బలు!

Published Wed, Oct 4 2023 4:43 PM | Last Updated on Wed, Oct 4 2023 5:15 PM

Actress Pooja Hegde Knee Injury Pic Viral - Sakshi

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే గాయపడింది. కొన్నాళ్ల ముందు తెలుగులో వరస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏం చేయట్లేదు. పలు మూవీస్‪‌లో ఛాన్సులు వచ్చారని అన్నారు గానీ వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు తాను గాయపడినట్లు ఓ ఫొటోతో చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌.. స్టార్‌ హీరోకు షాక్‌)

మోకాలికి దెబ్బలు
హీరోయిన్లు అంటే గ్లామర్ చూపించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా అలానే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ మోకాలికి దెబ్బలు తగిలించుకుంది. అందుకు సంబంధించిన ఫొటోని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

కలిసిరాని లక్
అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి హిట్ సినిమాలతో మంచి ఊపు మీద కనిపించిన పూజాహెగ్డేకు గతేడాది వరస దెబ్బలు తగిలాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ (హిందీ).. ఇలా చేసినవి చేసినట్లు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఇవే అనుకుంటే 'గుంటూరు కారం' నుంచి ఈమెని తప్పించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి పోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పూజాహెగ్డే తెలుగు ఇండస్ట్రీకి దాదాపు దూరమైనట్లే.

(ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement