ఐపీఎల్ 16వ సీజన్‌లో రెడో శతకం నమోదైంది. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. 49 బంతుల్లో 9 సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.
అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలింది. కామెరాన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 4 ఓవర్‌లో గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన డెలివరీని స్కూప్ ఆడే ప్రయత్నంలో బంతి మోకాలికి గట్టిగా తగిలింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో ఫిజియో వచ్చి పరిశీలించి చికిత్స చేశాడు. అయితే అదే సమయంలో ముంబై ఆటగాడు తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ కాలికి మర్దన చేసి క్రీడాస్పూర్తిని చాటుకోవడం విశేషం.
ఇక నొప్పి బాధిస్తున్నా వెంకటేశ్ అయ్యర్ తన దూకుడును ఏమాత్రం ఆపలేదు. చూస్తుండగానే ఫిఫ్టీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్.. 90 పరుగులకు చేరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అయితే 90 నుంచి వంద మార్క్ అందుకోవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సింగిల్స్ తీస్తూ సెంచరీకి చేరువయ్యాడు.
ఈ క్రమంలో అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. అయితే గాయం పెద్దగా లేకపోవడం ఊరట అని చెప్పొచ్చు. బంతి కాలికి బలంగా తగలడంతో నొప్పి కాస్త ఎక్కువే ఉందని.. ఎలాగూ ఇంపాక్ట్ కింద డగౌట్ కూర్చుంటా కాబట్టి నొప్పి తగ్గే అవకాశం ఉంది. అని తొలి ఇన్నింగ్స్ అనంతరం చెప్పుకొచ్చాడు.
చదవండి: Nitish Rana Vs Hrithik Shokeen: గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే!
Comments
Please login to add a commentAdd a comment