IPL 2023, CSK Vs KKR: CSK All-Rounder Shivam Dube's Six Hits KKR Cheerleader - Sakshi
Sakshi News home page

#ShivamDube: శివమ్‌ దూబే సిక్సర్‌ దెబ్బ.. కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ అబ్బ!

Published Sun, May 14 2023 8:58 PM | Last Updated on Mon, May 15 2023 11:10 AM

IPL 2023: CSK Shivam Dube Big Sixer Scares KKR Cheer-girls Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా కేకేఆర్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ సమయంలో శివమ్‌ దూబే కొట్టిన సిక్సర్‌ కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ను తాకడం ఆసక్తి కలిగించింది. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో సుయాశ్‌ శర్మ వేసిన ఐదో బంతిని దూబే ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు.

అక్కడే కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ కూర్చొని ఉండగా వారి వద్దకే నేరుగా బంతి వెళ్లింది. బంతి వెళ్లి ఒక చీర్‌గర్ల్‌కు తాకింది. పాపం బంతి స్పీడుగా వచ్చి తగలడంతో నొప్పితో విలవిల్లాలాడిన చీర్‌గర్ల్‌ బంతి తగిలిన చోట రాసుకోవడం కనిపించింది. ఆ తర్వాత చీర్‌గర్ల్స్‌ మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: ధోనిని గుర్తుకుతెచ్చిన అనూజ్‌ రావత్‌.. అశ్విన్‌ డైమండ్‌ డక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement