టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 100 సిక్స్‌లు బాదిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. లీడ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో స్టోక్స్ ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డును 151 టెస్టు ఇన్నింగ్స్‌లలో స్టోక్స్ సాధించాడు.
ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో 107 సిక్స్‌లతో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఉండగా, ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అరుదైన ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడు స్టోక్స్ కావడం విశేషం.
టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌లు
బ్రెండన్ మెకల్లమ్- 107(176 ఇన్నింగ్స్‌లు)
ఆడమ్ గిల్‌క్రిస్ట్-100( 137 ఇన్నింగ్స్‌లు)
బెన్ స్టోక్స్-100 (151 ఇన్నింగ్స్‌లు)
క్రిస్ గేల్-98 (182 ఇన్నింగ్స్‌లు)
జాక్వెస్ కల్లిస్- 97(280 ఇన్నింగ్స్‌లు)
వీరేంద్ర సెహ్వాగ్-91(104 ఇన్నింగ్స్‌లు)
బ్రియాన్ లారా-88(232 ఇన్నింగ్స్‌లు)
క్రిస్ క్రేయన్స్-87(104 ఇన్నింగ్స్‌లు)
వివ్ రిచర్డ్స్-84(182 ఇన్నింగ్స్‌లు)
ఆండ్రూ ఫ్లింటాఫ్-82(130 ఇన్నింగ్స్‌లు)
చదవండి:T20 WC 2022: 'ఆ ఆల్‌రౌండర్‌కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం'
Comments
Please login to add a commentAdd a comment