టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్కరమ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ప్రత్యర్ధి జట్టుపై అత్యంత తక్కువ సగటు(16.26)తో బ్యాటింగ్ చేసిన మూడో ఓపెనర్‌గా మార్క్రామ్ నిలిచాడు. కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 8 పరుగులు చేసిన మార్కరమ్ ఈ ఆప్రతిష్టతను మూట కట్టుకున్నాడు.
అంతకు ముందు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ 15.50 సగటుతో తొలి స్ధానంలో ఉండగా, 16.26 ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డెన్నిస్ అమ్మీస్ రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ సిరీస్‌లో మార్కరమ్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు కలిపి కేవలం 60 పరుగులు మాత్రమే సాదించాడు. ఇక కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment