![Sourav Ganguly against toss abolition in Test cricket - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/22/GANGULY-KAD.jpg.webp?itok=zegni9Ay)
కోల్‌కతా: ఆతిథ్య జట్లకు అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో టెస్టుల్లో ‘టాస్’ను ఎత్తివేయాలన్న ప్రతిపాదనను మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యతిరేకించాడు. ‘ఈ ఆలోచన అమల్లోకి వస్తుందో రాదో కానీ, టాస్ ఎత్తివేతను మాత్రం వ్యక్తిగతంగా నేను సమర్థించను. ఒకవేళ ఆతిథ్య జట్టు టాస్ గెలవకుంటే దానికి ప్రయోజనాలు దక్కవు కదా?’ అని వ్యాఖ్యానించాడు.
1877 నుంచి టెస్టుల్లో అమల్లో ఉన్న టాస్ పద్ధతి రద్దుపై ఈ నెల చివర్లో ముంబైలో ఐసీసీ క్రికెట్ కమిటీ చర్చించనుంది.
Comments
Please login to add a commentAdd a comment