టెస్టు క్రికెట్‌లో భారత మహిళల జట్టు ప్రదర్శన | Indian womens team performance in Test cricket | Sakshi
Sakshi News home page

టెస్టు క్రికెట్‌లో భారత మహిళల జట్టు ప్రదర్శన

Published Tue, Jun 15 2021 4:06 AM | Last Updated on Tue, Jun 15 2021 8:10 AM

Indian womens team performance in Test cricket - Sakshi

2014లో ఇంగ్లండ్‌పై ఏకైక టెస్టులో విజయానంతరం మిథాలీ రాజ్‌ సారథ్యంలోని భారతæమహిళల జట్టు (ఫైల్‌)

మహిళల క్రికెట్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ 1934లో జరిగితే భారత మహిళలు టెస్టు ఆడేందుకు మరో 42 ఏళ్లు పట్టింది. ఆట మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ‘ఉమెన్‌ యాషెస్‌’ పేరుతో మహిళల టెస్టు ఫార్మాట్‌ను బ్రతికిస్తుండగా... ఒకదశలో వీటితో పోటీ పడిన న్యూజిలాండ్‌ కూడా 17 ఏళ్లుగా టెస్టు మ్యాచ్‌ ఆడనే లేదు. ముందుగా వన్డేలు, ఆపై టి20ల జోరులో సుదీర్ఘ ఫార్మాట్‌ మనుగడ సాగించడం కష్టంగా మారిపోతున్న తరుణంలో ఏడేళ్ల తర్వాత మన భారత మహిళల జట్టుకు మరో టెస్టు ఆడే అవకాశం దక్కింది. రేపటి నుంచి మిథాలీ రాజ్‌ బృందం ఇంగ్లండ్‌తో తలపడనున్న నేపథ్యంలో భారత టెస్టు క్రికెట్‌కు సంబంధించిన విశేషాలు....

గెలుపు పిలుపు....
1. నవంబర్‌ 17–19, 1976
ప్రత్యర్థి: వెస్టిండీస్, వేదిక: పట్నా
ఫలితం: 5 వికెట్లతో భారత్‌ విజయం  
తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 127 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ 9 వికెట్లకు 161 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ 88 పరుగులకే ఆలౌటైంది. 55 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.  

2. మార్చి 19–22, 2002
ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, వేదిక: పార్ల్‌
ఫలితం: 10 వికెట్లతో భారత్‌ విజయం
అంజుమ్‌ చోప్రా, అంజు జైన్, హేమలత, మిథాలీ, మమతా అర్ధ సెంచరీలతో భారత్‌ 9 వికెట్లకు 404 పరుగులకు డిక్లేర్‌ చేసింది. దక్షిణాఫ్రికా 150 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికా జట్టు 266 పరుగులు చేసింది. 13 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ ఈ ఏకైక టెస్టులో గెలిచి తొలిసారి సిరీస్‌ కూడా సొంతం చేసుకుంది.  

3. ఆగస్టు 29–సెప్టెంబర్‌ 1, 2006
ప్రత్యర్థి: ఇంగ్లండ్, వేదిక: టాంటన్‌
ఫలితం: 5 వికెట్లతో భారత్‌ విజయం
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ చేసిన 307 పరుగులకు జవాబుగా ఇంగ్లండ్‌ 99 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో ఇంగ్లండ్‌ 305 పరుగులు సాధించగా ... 98 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఛేదించింది.  

4. ఆగస్టు 13–16, 2014
ప్రత్యర్థి: ఇంగ్లండ్, వేదిక: వామ్స్‌లీ  
ఫలితం: 6 వికెట్లతో భారత్‌ విజయం
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 92 పరుగులకు ఆలౌట్‌ కాగా భారత్‌ 114 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ 202 పరుగులు సాధించగా, భారత్‌ 181 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.  
 

5. నవంబర్‌ 16–19, 2014
ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, వేదిక: మైసూరు
ఫలితం: ఇన్నింగ్స్‌ 34 పరుగులతో భారత్‌ గెలుపు
కామిని (192), పూనమ్‌ రౌత్‌ (130) సెంచరీలతో భారత్‌ 6 వికెట్లకు 400 వద్ద డిక్లేర్‌ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 234, రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత జట్టు ఆడిన మొత్తం సిరీస్‌లు: 19
ఆస్ట్రేలియా చేతిలో 4,  ఇంగ్లండ్, వెస్టిండీస్‌ చేతిలో ఒక్కో టెస్టులో భారత్‌ ఓడింది. 6
అత్యల్ప స్కోరు (వెస్టిండీస్‌పై, 1976–జమ్మూలో) 65
అత్యధిక వికెట్లు (డయానా ఎడుల్జీ–20 టెస్టుల్లో) 63
అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన (నీతూ డేవిడ్, ఇంగ్లండ్‌పై, 1995–జంషెడ్‌పూర్‌) 8/58
సుధా షా (అత్యధిక టెస్టులు) 21
ప్రస్తుత జట్టులో అత్యధికంగా మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామి ఆడిన టెస్టుల సంఖ్య. 2002లో వీరిద్దరు ఒకే మ్యాచ్‌ (ఇంగ్లండ్‌తో లక్నోలో) ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశారు.10
ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య. ఇందులో 5 గెలిచిన భారత్‌ 6 ఓడింది. మరో 25 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.36
అత్యధిక స్కోరు (ఇంగ్లండ్‌పై, 2002–టాంటన్‌లో) 467
అత్యధిక పరుగులు (సంధ్యా అగర్వాల్‌–13 టెస్టుల్లో )110
అత్యధిక వ్యక్తిగత స్కోరు (మిథాలీ రాజ్‌; ఇంగ్లండ్‌పై, 2002–టాంటన్‌లో). భారత్‌ తరఫున ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు కాగా... ఏకైక డబుల్‌ సెంచరీ ఇదే కావడం విశేషం. 214
శాంతా రంగస్వామి (కెప్టెన్‌గా ఎక్కువ టెస్టులు)12

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement