
పేలవ ప్రదర్శనతో కష్టాల్లో ఉన్న శ్రీలంక జట్టుకు మరో దెబ్బ తగిలింది. భారత జట్టుతో డిసెంబర్ 2న న్యూఢిల్లీలో మొదలయ్యే మూడో టెస్టుకు శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగన హెరాత్ దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా హెరాత్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని, గురువారం అతను స్వదేశానికి బయలుదేరుతాడని శ్రీలంక బోర్డు తెలిపింది. హెరాత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండెర్‌సేను ఎంపిక చేశారు. వాండెర్‌సే ఇప్పటివరకు 11 వన్డేలు, ఏడు టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు జట్టులో అతనికి తొలిసారి స్థానం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment