శ్రీలంక ఘన విజయం Record-Breaker Rangana Herath Leads Sri Lanka's Crushing Win Over Bangladesh | Sakshi
Sakshi News home page

శ్రీలంక ఘన విజయం

Published Sun, Mar 12 2017 12:15 AM

శ్రీలంక ఘన విజయం

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా హెరాత్‌ రికార్డు  
గాలే: రంగన హెరాత్‌ ఆరు వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక జట్టు 259 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌లో లంక 1–0తో ఆధిక్యం సాధించింది. చివరి టెస్టు కొలంబోలో 15 నుంచి జరుగుతుంది. అలాగే ఈ మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది వికెట్లతో రాణించిన కెప్టెన్‌ హెరాత్‌ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు (366) తీసిన తొలి ఎడంచేతి వాటం స్పిన్నర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు వెటోరి (న్యూజిలాండ్‌–362 వికెట్లు) పేరిట ఉంది. చివరిరోజు శనివారం 457 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ హెరాత్‌ ధాటికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. సౌమ్య సర్కార్‌ (49 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్‌), లిటన్‌ దాస్‌ (62 బంతుల్లో 35; 2 ఫోర్లు), ముష్ఫికర్‌ రహీమ్‌ (98 బంతుల్లో 34; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్లు. పెరీరాకు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement