Ind vs Nz: అతడు రంగన హెరాత్‌ను గుర్తు చేశాడు: బ్రాడ్‌ హాగ్‌ | Ind vs Nz Test: Brad Hogg praises Axar Patel Reminds Him Rangana Herath | Sakshi
Sakshi News home page

Ind vs Nz: అతడు రంగన హెరాత్‌ను గుర్తు చేశాడు: బ్రాడ్‌ హాగ్‌

Published Tue, Nov 30 2021 2:57 PM | Last Updated on Tue, Nov 30 2021 3:06 PM

Ind vs Nz Test: Brad Hogg praises Axar Patel Reminds Him Rangana Herath - Sakshi

Ind vs Nz Test: Brad Hogg praises Axar Patel Reminds Him Rangana Herath: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ టీమిండియా బౌలర్‌ అక్షర్‌ పటేల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన ఆట తీరుతో శ్రీలంక క్రికెటర్‌ రంగన హెరాత్‌ను గుర్తు చేశాడన్నాడు. అద్భుతమైన బౌలింగ్‌ అటాక్‌తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టడం చూస్తుంటే ముచ్చటేస్తుందని పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో తొలి టెస్టులో భాగంగా అక్షర్‌ పటేల్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి.. కెరీర్‌లో ఐదో సారి ఈ ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ పడగొట్టి మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రాడ్‌ హాగ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ... ‘‘అక్షర్‌ పటేల్‌ నాకు రంగన హెరాత్‌ను గుర్తుచేశాడు. హైట్‌ తనకు అదనపు బలం. రైట్‌ హ్యాండర్‌కు బౌల్‌ చేసేటపుడు రౌండ్‌ ది వికెట్‌ వేస్తాడు. బ్యాటర్లను అస్సలు రిలాక్స్‌ అవ్వనివ్వడు.

తన బౌలింగ్‌లో బ్యాటర్‌ స్వీప్‌ షాట్‌ ఆడటం చాలా అరుదు. తన బౌలింగ్‌ శైలి సూపర్‌’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక కాన్పూర్‌ టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తున్న వేళ.. అజాజ్‌ పటేల్‌, రచిన్‌ రవీంద్ర అడ్డుగోడగా నిలబడి న్యూజిలాండ్‌ను ఓటమి నుంచి తప్పించారు. ఒక్క వికెట్‌ సాధిస్తే చాలు విజయం మనదే అనుకున్న తరుణంలో వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

చదవండి: IPL 2022 Auction: ఏయే జట్లు ఎవరిని రిటైన్‌ చేసుకుంటున్నాయి? ఎంత మొత్తం ఖర్చు చేయాలి? పూర్తి వివరాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement