లేటు వయసులో కెప్టెన్సీ
శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ కు లేటు వయసులో కెప్టెన్సీ ఛాన్స్ దక్కింది. టెస్టు టీమ్ కెప్టెన్ గా అతడు ఎంపికయ్యాడు. జింబాబ్వే జరగనున్న రెండు టెస్టుల సిరీస్ లో జట్టుకు అతడు నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం, వైస్ కెప్టెన్ దినేశ్ చందిమాల్ కూడా అందుబాటులో లేకపోవడంతో హెరాత్ కు అవకాశం వచ్చింది. టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన 17 ఏళ్ల తర్వాత అతడికి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం దక్కడం విశేషం.
38 ఏళ్ల హెరాత్ పెద్ద వయసులో కెప్టెన్ ఛాన్స్ దక్కించున్న శ్రీలంక ప్లేయర్ గా ఘనత సాధించనున్నాడు. సోమచంద్ర డిసిల్వా తర్వాత టెస్టు జట్టుకు నాయకుడిగా ఎంపికైన బౌలర్ హెరాత్ ఒక్కడే. 1999లో టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన అతడు ఇప్పటివరకు 73 టెస్టులు, 71 వన్డేలు, 17 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 332 వికెట్లు పడగొట్టాడు.