కొలొంబో: 30 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, శ్రీలంక క్రికెట్‌లో ప్రకంపనలకు కారణమైన భానుక రాజపక్స మాట మార్చాడు. పది రోజుల క్రితం చేసిన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కు తీసుకున్నాడు. మున్ముందు జట్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్ ద్వారా వెల్లడించింది. శ్రీలంక యువజన క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స జోక్యంతో భానుక.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, లంక క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టిన కొత్త ఫిట్‌నెస్ రూల్స్‌ను నిరసిస్తూ భానుక రాజపక్సతో పాటు మరో క్రికెటర్(దనుష్క రాజపక్స) కూడా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం లంక క్రికెట్‌లో పెద్ద దుమారం రేపింది. ఈ ఇద్దరి నిర్ణయం పట్ల రాజకీయ నాయకులు, మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించాలని మాజీ పేసర్ లసిత్ మలింగ ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరిని అభ్యర్ధించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక నూతన ఫిట్‌నెస్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వారి వేతనాల్లో కోత విధించబడుతుంది.
చదవండి: ఇకపై ప్రతి ఏడాది భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌లు..!
Comments
Please login to add a commentAdd a comment