Bhanuka Rajapaksa Retirement: శ్రీలంక క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ యువ ఆటగాడు, స్టార్ క్రికెటర్ భానుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డుకు లేఖ పంపాడు. లంక బోర్డు ప్రవేశపెట్టిన నూతన ఫిట్‌నెస్ మార్గదర్శకాల (ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టనున్నారు) కారణంగానే అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతేడాది(2021) జరిగిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లో ఉన్న రాజపక్స.. అనూహ్య నిర్ణయం తీసుకోవడం శ్రీలంక క్రికెట్‌లో సంచలనంగా మారింది. కేవలం 5 వన్డేలు, 18 టీ20లు మాత్రమే ఆడిన రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై ఆ దేశ మాజీలు స్పందించారు. రాజపక్స.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
కాగా, 30 ఏళ్ల రాజపక్స.. శ్రీలంక అండర్-19 జట్టులో అద్భుతాలు సృష్టించి, సీనియర్ జట్టులోకి వచ్చాడు. గతేడాది స్వదేశంలో ధవన్ సేనతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వన్డే అరంగ్రేటం చేసిన అతను.. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.
చదవండి: ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..!
Comments
Please login to add a commentAdd a comment