కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం | SL VS AUS 2nd Test: Sri Lanka Crush Australia By Innings 39 Runs To Level Series | Sakshi
Sakshi News home page

SL VS AUS 2nd Test: కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం

Published Mon, Jul 11 2022 6:43 PM | Last Updated on Mon, Jul 11 2022 6:43 PM

SL VS AUS 2nd Test: Sri Lanka Crush Australia By Innings 39 Runs To Level Series - Sakshi

ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతూ అట్టుడుకుతున్న ద్వీప దేశం శ్రీలంకకు భారీ ఊరట లభించే వార్త ఇది. గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంక జట్టు పటిష్టమైన కంగారూలను ఖంగుతినిపించి 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దినేశ్‌ చండీమాల్‌ (206) అజేయ ద్విశతకంతో, అరంగేట్రం స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య 12 వికెట్లతో (6/118, 6/59) చెలరేగి శ్రీలంకకు చారిత్రక విజయాన్ని అందించారు. నాలుగో రోజు ఆటలో వీరిద్దరితో పాటు రమేశ్‌ మెండిస్ (2/47)‌, మహీశ్‌ తీక్షణ (2/28) కూడా రాణించడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌ 39 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.

జయసూర్య స్పిన్‌ మాయాజాలం ధాటికి ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. లబూషేన్‌ (32) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 431/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అంతకుముందు స్టీవ్‌ స్మిత్‌ (145 నాటౌట్‌), లబూషేన్‌ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే, ఆసీస్‌ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక.. ఆతర్వాత వన్డే సిరీస్‌ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. 
చదవండి: SL Vs Aus: చండిమాల్‌ డబుల్‌ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్‌ బ్యాటర్లకు చుక్కలు!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement