గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక పైచేయి సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ దినేశ్ చండీమాల్ అజేయ శతకంతో (118) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 67 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. చండీమాల్‌తో పాటు రమేశ్ మెండిస్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్‌లో చండీమాల్ కాకుండా మరో నలుగురు హాఫ్‌సెంచరీలు సాధించారు.
💯
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 10, 2022
Dinesh Chandimal brings up his 13th Test hundred, reaching the mark in 195 balls 🙌#SLvAUS pic.twitter.com/zLiBKUylBI
కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85), ఏంజలో మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61)లు శ్రీలంక భారీ స్కోర్ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, మిచెల్ స్వెప్సన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్ ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో ఆసీస్‌ను తిప్పేశాడు.
చదవండి: టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 82 పరుగులు..!
Comments
Please login to add a commentAdd a comment