తొలి టెస్ట్‌లో పాక్ చేతిలో దారుణంగా ఓడి కసితో రగిలిపోతున్న శ్రీలంక.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తుంది. లంక స్పిన్నర్లు రెచ్చిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో ఉంది. 315 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను (తొలి ఇన్నింగ్స్) ప్రారంభించిన శ్రీలంక.. మరో 63 పరుగులు జోడించి 378 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్‌నైట్ బ్యాటర్ డిక్వెల్లా (51) అర్ధసెంచరీతో రాణించగా.. రమేశ్ మెండిస్ (35) పర్వాలేదనిపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. లంక స్పిన్నర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్‌లో అజేయ శతకంతో పాక్‌ను గెలిపించిన అబ్దుల్లా షఫీక్ ఈ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు.
మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (32), కెప్టెన్ బాబర్ ఆజమ్ (16), వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (24), ఫవాద్ ఆలం (24) లు విఫలం కాగా.. మిడిలార్డర్ ఆటగాడు అఘా సల్మాన్ (62) లంక స్పిన్నర్లకు కాసేపు ఎదురొడ్డాడు. సల్మాన్‌ను ప్రభాత్ జయసూర్య అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించడంతో రెండో రోజు ఆట ముగిసింది. రమేశ్ మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీసి పాక్‌ను కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం పాక్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రోజు లంక ఆటగాళ్లు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80) అర్ధసెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే.
చదవండి: సూపర్ ఫామ్‌ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి
Comments
Please login to add a commentAdd a comment