పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి ఓవరాల్‌గా 323 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కెప్టెన్ కరుణరత్నే (27), ధనంజయ (30) నిలకడగా ఆడుతూ పాక్‌కు కొండంత లక్ష్యాన్ని నిర్ధేశించే పనిలో ఉన్నారు. తొలి టెస్ట్‌లో పాక్ 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేసిని నేపథ్యంలో ఈసారి లంక జాగ్రత్త పడుతుంది. మరో 5 వికెట్లు చేతిలో ఉండటంతో కనీసం 450 పరుగుల టార్గెట్‌ను పాక్ ముందుంచాలని భావిస్తుంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఫలితం లంకకు అనుకూలంగా రావడం ఖాయంగా కనిపిస్తుంది.
191/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 40 పరుగులు జోడించి 231 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్ (62) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లంక స్పిన్నర్లు రమేశ్ మెండిస్ (5/47), ప్రభాత్ జయసూర్య (3/80) పాక్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80), డిక్వెల్లా (51) అర్ధసెంచరీలతో రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
చదవండి: టీమిండియా మెంటల్ హెల్త్ కోచ్‌గా మళ్లీ అతనే..!
Comments
Please login to add a commentAdd a comment