పాక్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ ధనంజయ డిసిల్వా (109) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 360 పరుగుల (8 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 508 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (46), కెప్టెన్ బాబర్ ఆజమ్ (26) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రెండో వికెట్‌కు అజేయమైన 47 పరుగులు జోడించారు. ఈ దశలో వెలుతురు లేమి కారణంగా ఆటను కాస్త ముందుగా ఆపేశారు. ఆట ముగిసే సమయానికి పాక్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో లంక విజయానికి 9వికెట్లు అవసరం కాగా.. పాక్ గెలుపుకు 419 పరుగులు చేయాల్సి ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను పాక్ కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.
అంతకుముందు ధనంజయ డిసిల్వాకు తోడుగా కెప్టెన్ కరుణరత్నే (61), టెయిలెండర్ రమేశ్ మెండీస్ (45 నాటౌట్) రాణించడంతో శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించి ప్రత్యర్ధి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
స్కోర్ వివరాలు..
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్ (చండీమల్ (80), నసీమ్ షా (3/58))
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (అఘా సల్మాన్ (62), రమేశ్ మెండిస్ (5/47))
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 360/8 డిక్లేర్ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్ షా (2/44))
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 89/1 (ఇమామ్ ఉల్ హక్ (46 నాటౌట్), ప్రభాత్ జయసూర్య (1/46))
చదవండి: వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లో!
Comments
Please login to add a commentAdd a comment