పసికూనపై లంకేయుల జయకేతనం | Sri Lanka thumped fragile Bangladesh by innings and 248 runs | Sakshi
Sakshi News home page

పసికూనపై లంకేయుల జయకేతనం

Published Thu, Jan 30 2014 3:40 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

పసికూనపై లంకేయుల జయకేతనం

పసికూనపై లంకేయుల జయకేతనం

మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. క్రికెట్ పసికూనను ఇన్నింగ్స్ 248 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరో రోజు మిగులుండగానే మ్యాచ్ ముగించింది. 35/1 ఓవర్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 250 పరుగులకు ఆలౌటయింది. మొమినల్ హక్ ఒక్కడే(50) అర్థ సెంచరీతో రాణించాడు. లంక బౌలర్లలో పెరీరా 5 వికెట్లు, లక్మాల్ 3 వికెట్లు పడగొట్టారు. ఎరెగ, హిరాత్ చెరో వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 232 పరుగులు చేసింది. లంకేయులు 730/6 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. మహేళ జయవర్ధనే (272 బంతుల్లో 203 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు సిల్వా(139) వితనగే (103 నాటౌట్) సెంచరీలు సాధించడంతో  లంక భారీ స్కోరు చేసింది. జయవర్ధనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న చిట్టగ్యాంగ్ లో ప్రారంభమవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement