
బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సెల్హాట్ వేదికగా వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 1-0 అధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో యస్తికా భాటియా(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్(30), షెఫాలీ వర్మ(31) పరుగులతో రాణించారు.
బంగ్లా బౌలర్లలో రబియా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్ రెండు, త్రిష్నా, ఫాతిమా ఖాటూన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది.
బంగ్లా బ్యాటర్లలో కెప్లెన్ సుల్తానా(51) ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. పూజా రెండు, శ్రేయంకా, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఏప్రిల్ 30న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment