Cricket Test Series
-
బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం
-
ఆసీస్‌తో ఆరంభమైన తొలి టెస్టు మొదటి రోజు
-
డీన్ ఎల్గార్ రెండో టెస్టు సెంచరీ
గాలె: శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మొదటి ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గార్ సెంచరీ సాధించాడు. పేస్, స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న అతడు 187 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అతడికి ఇది రెండో సెంచరీ. డూ ఫ్లెసిస్(80) అర్థ సెంచరీతో రాణించాడు. పీటర్సన్ 34, ఆమ్లా 11, డీవిలియర్స్ 21 పరుగులు చేసి అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో లక్మాల్, పెరీరా రెండేసి వికెట్లు తీశారు. హిరాత్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
టీమిండియా విజయలక్ష్యం 407 పరుగులు
ఆక్లాండ్ : ఆక్లాండ్ టెస్ట్‌లో రెండో ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 407 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. కాగా మూడో రోజు పిచ్ స్వభావం దారుణంగా మారిపోయింది. ఫలితంగా పదహారు వికెట్లు టప టప రాలిపోయాయి. టీమిండియా మూడో రోజు అనూహ్య రీతిలో 202 పరుగులకు ఆలౌటైతే, ఆ తర్వాత న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులకు కుప్ప కూలింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకుంటే తప్ప ఈ పిచ్ మీద విజయం సాధించడం కష్ట సాధ్యమే. ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 72 మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. వాగ్నర్ నాలుగు వికెట్లు తీసుకుంటే, బౌల్ట్, సౌతీ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టేలర్ 41 పరుగులు మినహాయిస్తే ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. షమీ మూడు, జహీర్ రెండు, ఇశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
ఒక్కడి స్కోరు కొట్టలేకపోయారు
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌటయింది. దీంతో న్యూజిలాండ్‌కు 301 ఆధిక్యం లభించింది. కివీస్ కెప్టెన్ మెకల్లమ్ ఒక్కడే 224 పరుగులు చేయగా, ధోని సేన మాత్రం ఒక్కడు సాధించిన స్కోరు కూడా చేయలేక చతికిలపడింది. 130/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కేవలం 72 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 72, ధోని 10, జహీర్ ఖాన్ 14 పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 3 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. కివీస్ బౌలర్లో వాగ్నేర్ 4, బౌల్ట్ 3, సౌతీ 3 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఫుల్టన్(5), రూథర్‌ఫోర్డ్(0), విలియమ్సన్(3), మెకల్లమ్(0) అవుటయ్యారు. -
పసికూనపై లంకేయుల జయకేతనం
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. క్రికెట్ పసికూనను ఇన్నింగ్స్ 248 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరో రోజు మిగులుండగానే మ్యాచ్ ముగించింది. 35/1 ఓవర్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 250 పరుగులకు ఆలౌటయింది. మొమినల్ హక్ ఒక్కడే(50) అర్థ సెంచరీతో రాణించాడు. లంక బౌలర్లలో పెరీరా 5 వికెట్లు, లక్మాల్ 3 వికెట్లు పడగొట్టారు. ఎరెగ, హిరాత్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 232 పరుగులు చేసింది. లంకేయులు 730/6 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. మహేళ జయవర్ధనే (272 బంతుల్లో 203 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు సిల్వా(139) వితనగే (103 నాటౌట్) సెంచరీలు సాధించడంతో లంక భారీ స్కోరు చేసింది. జయవర్ధనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న చిట్టగ్యాంగ్ లో ప్రారంభమవుతుంది.