డీన్ ఎల్గార్ రెండో టెస్టు సెంచరీ | Dean Elgar ton takes South Africa against Sri Lanka | Sakshi
Sakshi News home page

డీన్ ఎల్గార్ రెండో టెస్టు సెంచరీ

Published Wed, Jul 16 2014 6:48 PM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

డీన్ ఎల్గార్ రెండో టెస్టు సెంచరీ

డీన్ ఎల్గార్ రెండో టెస్టు సెంచరీ

గాలె: శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మొదటి ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గార్ సెంచరీ సాధించాడు. పేస్, స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న అతడు 187 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అతడికి ఇది రెండో సెంచరీ.

డూ ఫ్లెసిస్(80) అర్థ సెంచరీతో రాణించాడు. పీటర్సన్ 34, ఆమ్లా 11, డీవిలియర్స్ 21 పరుగులు చేసి అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో లక్మాల్, పెరీరా రెండేసి వికెట్లు తీశారు. హిరాత్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement