శ్రీలంకపై రెండో టెస్ట్‌లో విజయం అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో ఉండింది. తాజా విజయంతో సౌతాఫ్రికా ఆసీస్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు సౌతాఫ్రికా మరో గెలుపు దూరంలో ఉంది. సౌతాఫ్రికా తమ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే పాకిస్తాన్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు.
ప్రస్తుతం సౌతాఫ్రికా విజయాల శాతం 63.33గా ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో సౌతాఫ్రికా ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 60.71 విజయాల శాతం కలిగి ఉంది. ఆసీస్ చేతిలో రెండో టెస్ట్‌లో ఓటమి అనంతరం టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ విజయాల శాతం 57.29గా ఉంది. ప్రస్తుత సైకిల్‌లో టీమిండియా 16 మ్యాచ్‌లు ఆడి తొమ్మిదింట విజయాలు సాధించింది.
సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల శాతం 45.45గా ఉంది. న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై వరుసగా రెండు టెస్ట్‌ల్లో మట్టికరిపించిన ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఆరో స్థానంలో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి.
టీమిండియా విషయానికొస్తే.. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 4-1 తేడాతో ఓడిస్తే భారత విజయాల శాతం 63.15కు చేరి టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. ఇలా జరిగితే భారత్ ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఆసీస్‌తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment