ఒక్కడి స్కోరు కొట్టలేకపోయారు | India all out for 202 in 1st innings | Sakshi
Sakshi News home page

ఒక్కడి స్కోరు కొట్టలేకపోయారు

Published Sat, Feb 8 2014 5:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

ఒక్కడి స్కోరు కొట్టలేకపోయారు

ఒక్కడి స్కోరు కొట్టలేకపోయారు

ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్  202 పరుగులకు ఆలౌటయింది. దీంతో న్యూజిలాండ్కు 301 ఆధిక్యం లభించింది. కివీస్ కెప్టెన్ మెకల్లమ్ ఒక్కడే 224 పరుగులు చేయగా, ధోని సేన మాత్రం ఒక్కడు సాధించిన స్కోరు కూడా చేయలేక చతికిలపడింది.

130/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కేవలం 72 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 72, ధోని 10, జహీర్ ఖాన్ 14 పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 3 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. కివీస్ బౌలర్లో వాగ్నేర్ 4, బౌల్ట్ 3, సౌతీ 3 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఫుల్టన్(5), రూథర్‌ఫోర్డ్(0), విలియమ్సన్(3), మెకల్లమ్(0) అవుటయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement