హామిల్టన్ వన్డేలోనూ భారత్ ఓటమి
హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై ధోని సేనకు వరుసగా రెండో పరాభవం ఎదురయింది. కివీస్తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి పాలయింది. బుధవారమిక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ పరుగుల తేడాతో ఓడిపోయింది. 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 41.3 ఓవర్లలో 277 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయినట్టు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 293 చేయాల్సివుంది.
కోహ్లి(78), ధోని(56) అర్థ సెంచరీలు చేసినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. రహానే 36, రైనా 35, రోహిత్ శర్మ 20, జడేజా 12, ధావన్ 12 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సౌతి 4, ఆండర్సన్ 3 వికెట్లు పడగొట్టారు. మిల్స్, మెక్ క్లీనాగన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించడంతో ఆటను 42 ఓవర్లకు కుదిరించారు. కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 297 పరుగులుగా నిర్ణయించారు.