Hamilton ODI
-
విలియమ్సన్ డబుల్ సెంచరీ
హామిల్టన్ (న్యూజిలాండ్): కెప్టెన్ కేన్ విలియమ్సన్ (412 బంతుల్లో 251; 34 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీ సాధించడంతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో... వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 243/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 145 ఓవర్లలో ఏడు వికెట్లకు 519 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. 97 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన విలియమ్సన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ 81వ ఓవర్లో మూడో బంతిని బౌండరీ దాటించిన విలియమ్సన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్ వెనుదిరుగుతున్నా... మరోవైపు విలియమ్సన్ దూకుడు కొనసాగించాడు. ఈసారీ రోచ్ బౌలింగ్‌లోనే బౌండరీ బాది విలియమ్సన్ డబుల్ సెంచరీ సాధించాడు. జేమీసన్ (51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి ఏడో వికెట్‌కు 94 పరుగులు జోడించాక విలియమ్సన్ అవుటయ్యాడు. జేమీసన్ అర్ధ సెంచరీ పూర్తి కాగానే విలియమ్సన్ కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. -
హామిల్టన్ వన్డేలోనూ భారత్ ఓటమి
-
హామిల్టన్ వన్డేలోనూ భారత్ ఓటమి
హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై ధోని సేనకు వరుసగా రెండో పరాభవం ఎదురయింది. కివీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి పాలయింది. బుధవారమిక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ పరుగుల తేడాతో ఓడిపోయింది. 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 41.3 ఓవర్లలో 277 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయినట్టు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 293 చేయాల్సివుంది. కోహ్లి(78), ధోని(56) అర్థ సెంచరీలు చేసినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. రహానే 36, రైనా 35, రోహిత్ శర్మ 20, జడేజా 12, ధావన్ 12 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సౌతి 4, ఆండర్సన్ 3 వికెట్లు పడగొట్టారు. మిల్స్, మెక్ క్లీనాగన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో ఆటను 42 ఓవర్లకు కుదిరించారు. కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 297 పరుగులుగా నిర్ణయించారు. -
ఇండియా టార్గెట్ 297 పరుగులు
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌కు కివీస్ 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయింది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. విలియమ్సన్(77), టేలర్(57) అర్థ సెంరీలు చేశారు. గుప్తిల్ 44, రైడర్ 20, ఆండర్సన్ 44, రోచి 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు. భవనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, జడేజా, రైనా తలో వికెట్ తీశారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ టార్గెట్ 297 పరుగులుగా నిర్ణయించారు.