హామిల్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్కు కివీస్ 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయింది. దీంతో మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించారు.
విలియమ్సన్(77), టేలర్(57) అర్థ సెంరీలు చేశారు. గుప్తిల్ 44, రైడర్ 20, ఆండర్సన్ 44, రోచి 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు. భవనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, జడేజా, రైనా తలో వికెట్ తీశారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ టార్గెట్ 297 పరుగులుగా నిర్ణయించారు.
ఇండియా టార్గెట్ 297 పరుగులు
Published Wed, Jan 22 2014 1:32 PM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement