ఈ నెలాఖరులో శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం. రోహిత్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ ఆడిన పలువురు సీనియర్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉండవచ్చు. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు భారత్ అదే జట్టుతో టీ20 సిరీస్ కూడా ఆడనుంది. టీ20లకు సెలెక్టర్లు వేరే కెప్టెన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ సమయానికి హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వస్తే అతనే టీమిండియా పగ్గాలు చేపట్టవచ్చు. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత్ క్రికెట్ జట్టు ఈ నెల 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్... ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనున్నాయి.
ఈ రెండు సిరీస్‌లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లతో పాటు జట్లు కూడా వేరు వేరుగా ఉండే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక కాని కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టుకు మాత్రమే పరిమితం కావచ్చు. ఈ రెండు సిరీస్‌లకు సీనియర్లు రోహిత్, కోహ్లి, బుమ్రా దూరంగా ఉండే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటన నుంచే టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రస్తానం మొదలవుతుంది.
గంభీర్ తనదైన మార్కును చూపించడం కోసం లంక సిరీస్‌లో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా లాంటి అప్ కమింగ్ టాలెంట్‌లకు ఎంపిక చేయవచ్చు. లంక పర్యటనలో టీ20లు జులై 27, 28, 30 తేదీల్లో.. వన్డేలు ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment