వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ అద్బుత విజయం సాధించింది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో పాక్ ఛేదించింది. దీంతో 6 వికెట్లతో విజయభేరి మోగించింది.
Tons from Abdullah Shafique and Mohammed Rizwan guide Pakistan to the most successful chase in ICC Men's Cricket World Cup history 🔥#CWC23 #PAKvSL 📝: https://t.co/oVVBdMbGPN pic.twitter.com/Y9xq0o3WOj
— ICC Cricket World Cup (@cricketworldcup) October 10, 2023
అయితే 345 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్లోయి పాకిస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో పాక్ జట్టును మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆదుకున్నాడు ఆ జట్టు మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్. ఈ ఇద్దరూ ఫస్ట్ స్లోగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ నిర్మించాక బౌండరీలు బాదారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తరువాత అబ్దుల్లా షఫీక్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 113 పరుగుల వద్ద షఫీక్ పెవిలియన్‌కు చేరాడు.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు విజయంలో పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(131), అబ్దుల్లా షఫీక్ (113) కీలక పాత్ర పోషించారు. అయితే పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులకి పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
స్కోర్లు: శ్రీలంక 344-9(50), పాకిస్తాన్ 345-4(48.2)
Comments
Please login to add a commentAdd a comment