ప్రపంచకప్‌కు గుల్ దూరం | Pakistan Unsure of Umar Gul's Availability for World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌కు గుల్ దూరం

Published Sat, Dec 27 2014 12:02 AM | Last Updated on Wed, Jul 25 2018 1:57 PM

ప్రపంచకప్‌కు గుల్ దూరం - Sakshi

ప్రపంచకప్‌కు గుల్ దూరం

కరాచీ: ప్రస్తుత పాకిస్తాన్ క్రికెటర్లలో అత్యంత సీనియర్ బౌలర్ ఉమర్‌గుల్ వన్డే ప్ర పంచకప్‌కు దూరమయ్యాడు. తన మోకాలి గాయం పూర్తిగా తగ్గనందున 15 మంది సభ్యుల ఎంపికలో గుల్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని పాక్ బోర్డు తెలిపింది. ‘గత ఏడాది గుల్ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది.
 
  గత నెలలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమయంలో నొప్పి తిరగబెట్టడంతో తనని పునరావాసానికి పంపించాం. ప్రస్తుతం గుల్ కోలుకోలేదు. తను ప్రపంచకప్ ఆడే అవకాశాలు లేవు’ అని పీసీబీ చైర్మన్ షహర్యర్ ఖాన్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement