Umar Gul
-
వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం
CWC 2023- Pakistan Team- PCB: వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 సారథిగా ప్రకటించింది. అదే విధంగా టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించింది. ఇక కెప్టెన్సీ మార్పులతో పాటు పాలనా విభాగం, శిక్షనా సిబ్బందిలోనూ కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా.. మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించిన పీసీబీ.. వహాబ్ రియాజ్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. బౌలింగ్ కోచ్‌లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ తాజాగా.. పీసీబీ తమ కోచింగ్ స్టాఫ్‌లో మరో ఇద్దరు మాజీ క్రికెటర్లను చేర్చుకుంది. ఉమర్ గుల్, సయీద్ అజ్మల్లకు బౌలింగ్ కోచ్‌లుగా అవకాశం ఇచ్చింది. గుల్ ఫాస్ట్‌బౌలింగ్ విభాగానికి కోచ్‌గా సేవలు అందించనుండగా.. అజ్మల్ స్పిన్ దళానికి మార్గదర్శనం చేయనున్నాడు. వీరిద్దరు డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా ఉమర్ గుల్ ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో ప్రయాణం ఆరంభించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కోచ్‌గా వ్యవహరించాడు. మోర్నీ మోర్కెల్ గుడ్‌బై కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్ దారుణ వైఫల్యంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బాబర్ బృందం వరుస ఓటముల కారణంగా.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ముఖ్యంగా వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ తన విధుల నుంచి వైదొలిగాడు. ఉమర్ గుల్.. సయీద్ అజ్మల్ కెరీర్ వివరాలు పాకిస్తాన్ తరఫున 2003లో ఎంట్రీ ఇచ్చిన 2016లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక తన కెరీర్లో ఈ రైటార్మ్ పేసర్ 47 టెస్టులాడి 163, 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు. అజ్మల్ విషయానికొస్తే.. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. 2015లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. తన కెరీర్లో 35 టెస్టులు, 113 వన్డేలు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 178, 184, 85 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 WC: ‘వరల్డ్‌కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’ -
పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జాతీయ జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రమీజ్ రాజా నుంచి పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, తొలిసారి జట్టు మొత్తం ప్రక్షాళణ చేపట్టిన నజమ్ సేథీ.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను, హెడ్ కోచ్‌గా అబ్దుల్ రెహ్మాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా మహ్మద్ యూసఫ్‌ను, బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్‌ను నియమించింది. సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీని బూచిగా చూపుతూ తొలుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పక్కకు పెట్టిన పీసీబీ.. తాజాగా హెడ్ కోచ్, కోచింగ్ సిబ్బంది, నాన్ కోచింగ్ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. ఈ మార్పులన్నీ తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ప్రక్షాళణ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. గత కొంతకాలంగా బాబర్ ఆజమ్‌పై గుర్రుగా ఉన్న పీసీబీ పలు మార్లు అతన్ని తప్పించి సారధ్య బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే బాబర్‌కు ఉన్న బలమైన కోఠరి కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా పీసీబీ చీఫ్ ఏదైతే అదైందని తెగించి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. @TheRealPCB announces Support Personnel for Sharjah T20Is. Abdul Rehman, Head Coach; Umar Gul, Bowling Coach; M Yousuf, Batting Coach; A Majeed, Fielding Coach; Drikus Simon, Trainer; Cliffe Deacon, Physio; Talha Ijaz, Analyst; Mansoor Rana, Manager; Ahsan Nagi, Media. #PAKvAFG — Najam Sethi (@najamsethi) March 14, 2023 కాగా, షార్జా వేదికగా మార్చి 24, 26, 27 తేదీల్లో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు మాత్రమే తాజాగా జరిగిన మార్పులన్నీ (కెప్టెన్, కోచింగ్, నాన్ కోచింగ్ స్టాఫ్) వర్తిసాయని పీసీబీ ప్రకటిన విడుదల చేసినప్పటికీ, ఎక్కడో ఏదో జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు జట్టులో తొలిసారి అవకాశం కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ బౌలర్ ఉమర్ గుల్ నియమితుడయ్యాడు. అతడు ఏప్రిల్4న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో చేరునున్నాడు. కాగా గుల్కు దేశీయ స్థాయిలో, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అదే విధంగా లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే గ్లాడియేటర్స్ బౌలింగ్ కోచ్‌గా కూడా ఉమర్ గుల్ పనిచేశాడు. కాగా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఉమర్ గుల్ వెల్లడించాడు. "పిఎస్ఎల్, కెపిఎల్, ఎల్‌పిఎల్ ,దేశీయ స్థాయిలో కోచింగ్ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. నా అనుభవంతో ఆఫ్ఘన్ బౌలర్లకు సహాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను" అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు. Honoured to be taking up this role with the @ACBofficials . Looking forward to imparting the best of the knowledge that i have and making it worth it for the boys. https://t.co/ouIYa0St2t — Umar Gul (@mdk_gul) April 1, 2022 -
'ఆ విషయంలో హర్భజన్ సింగ్ కంటే నేనే బెటర్'
పాకిస్తాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్ టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. హర్భజన్ సింగ్ కంటే తన బ్యాటింగ్ చాలా బాగుంటుందని ఉమర్ గుల్ తెలిపాడు. కాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆసియా లయన్స్‌కు ఉమర్ గుల్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే రెండు మ్యాచ్‌లు ఆడిన గుల్ కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. కాగా గతంలో 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ.. 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ భారత్‌పై గుల్ అధ్బుతంగా రాణించాడు. హర్భజన్ సింగ్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తాడు, కానీ నా బ్యాటింగ్‌కు ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాను. కాబట్టి బ్యాటింగ్ విషయంలో హర్భజన్ సింగ్ కంటే నేనే బెటర్ అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు. కాగా 2012 టీ20 ప్రపంచకప్‌లో గుల్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా గుల్ ఎంపికయ్యాడు. ఇక పాకిస్తాన్ తరుపున 60 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉమర్ గుల్ 85 వికెట్లు పడగొట్టాడు. చదవండి: జట్టు సీఈవోతో గొడవ.. ఏకంగా కెప్టెన్సీ నుంచే తీసేసారు! -
క్రికెట్‌కు ఉమర్ గుల్ గుడ్‌బై
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న పాక్ దేశవాళీ టోర్నీ టి20 కప్‌లో చివరి మ్యాచ్ ఆడిన గుల్... అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 47 టెస్టుల్లో 163 వికెట్లు పడగొట్టిన గుల్... 130 వన్డేల్లో 179 వికెట్లు తీశాడు. 60 అంతర్జాతీయ టి20ల్లో గుల్ మరో 85 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు దశాబ్దకాలం పాటు పాక్ జట్టు ప్రధాన పేసర్‌గా పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన గుల్ కెరీర్ వరుస గాయాలతో ఒడిదుడుకులకు లోనైంది. అంతర్జాతీయ టి20ల్లో టాప్–10లో రెండు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (5/6, 5/6) నమోదు చేసిన బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. యార్కర్ స్పెషలిస్ట్‌గా ప్రత్యేకత ప్రదర్శించిన గుల్... 2007 టి20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. రెండేళ్ల తర్వాత పాక్ గెలుచుకున్న టి20 వరల్డ్ కప్‌లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గుల్ కావడం విశేషం. పాకిస్తాన్ తరఫున తన చివరి మ్యాచ్‌ను అతను నాలుగేళ్ల క్రితం 2016లో ఆడాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
ఇస్లామాబాద్: రెండు దశాబ్దాలపాటు పాకిస్తాన్ క్రికెట్‌కు సేవలందించిన స్టార్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. నేషనల్ టీ20 కప్‌లో అతను బలూచిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి బలూచిస్తాన్, సౌతర్న్ పంజాబ్ జట్ల మధ్య పోరు అనంతరం ఉమర్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైన బలూచిస్తాన్ టోర్నీ నుంచి తప్పుకోగా.. పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దాదాపు 20 ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఉమర్ గుల్ మీడియా చాట్‌లో పేర్కొన్నాడు. కొత్త ఆటగాళ్లకు దారి ఇచ్చేందుకు, గొప్ప జీవితాన్నిచ్చిన క్రికెట్‌కు మరిన్ని సేవలు చేసేందుకే తాను వైదొలిగినట్టు స్పష్టం చేశాడు. (చదవండి: ప్రేక్షకులు లేకున్నా నిర్వహిస్తాం) ‘నా క్రికెట్ జీవితాన్ని చాలా ఎంజాయ్ చేశాను. క్రికెట్ జీవితంలో పోరాటాన్ని, విలువలను నేర్పింది. గౌరవాన్ని ఇచ్చింది. కెరీర్ ఎదుగులకు చాలా మంది మద్దతుగా నిలిచారు. గొప్పగొప్పవాళ్లతో పరిచయం మంచి అనుభవం. వాళ్లందరికీ కృతజ్ఞతలు. నా ఆటను ఆస్వాదించిన ప్రతి అభిమానికి ధన్యవాదాలు. వాళ్లే నాకు ప్రేరణనిచ్చారు. క్రికెట్ నుంచి పక్కకు తప్పుకోవడం కష్టంగానే ఉంది. నన్ను ఇంత ఉన్నత శిఖరాలకు చేర్చిన క్రికెట్‌ను, నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను’అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు. కాగా, 2002 అండర్ 19 వరల్డ్‌కప్‌లో మెరిసిన ఉమర్ గుల్ 2003లో పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2004లో భారత్-పాకిస్తాన్ లాహోర్ టెస్టులో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దాంతో పాకిస్తాన్ ముల్తాన్ టెస్టు సిరీస్‌ను డ్రా చేయగలిగింది. దశాబ్దం క్రితం టీ20 క్రికెట్లో ఉమర్ గుల్ నెంబర్ 1 బౌలర్‌గా కొనసాగాడు. (చదవండి: ‘చీఫ్ సెలెక్టర్’ పదవికి మిస్బా గుడ్‌బై) -
ప్రపంచకప్‌కు గుల్ దూరం
కరాచీ: ప్రస్తుత పాకిస్తాన్ క్రికెటర్లలో అత్యంత సీనియర్ బౌలర్ ఉమర్‌గుల్ వన్డే ప్ర పంచకప్‌కు దూరమయ్యాడు. తన మోకాలి గాయం పూర్తిగా తగ్గనందున 15 మంది సభ్యుల ఎంపికలో గుల్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని పాక్ బోర్డు తెలిపింది. ‘గత ఏడాది గుల్ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. గత నెలలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమయంలో నొప్పి తిరగబెట్టడంతో తనని పునరావాసానికి పంపించాం. ప్రస్తుతం గుల్ కోలుకోలేదు. తను ప్రపంచకప్ ఆడే అవకాశాలు లేవు’ అని పీసీబీ చైర్మన్ షహర్యర్ ఖాన్ చెప్పారు.