
పాకిస్తాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్ టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. హర్భజన్ సింగ్ కంటే తన బ్యాటింగ్ చాలా బాగుంటుందని ఉమర్ గుల్ తెలిపాడు. కాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆసియా లయన్స్‌కు ఉమర్ గుల్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే రెండు మ్యాచ్‌లు ఆడిన గుల్ కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. కాగా గతంలో 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ.. 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ భారత్‌పై గుల్ అధ్బుతంగా రాణించాడు.
హర్భజన్ సింగ్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తాడు, కానీ నా బ్యాటింగ్‌కు ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాను. కాబట్టి బ్యాటింగ్ విషయంలో హర్భజన్ సింగ్ కంటే నేనే బెటర్ అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు. కాగా 2012 టీ20 ప్రపంచకప్‌లో గుల్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా గుల్ ఎంపికయ్యాడు. ఇక పాకిస్తాన్ తరుపున 60 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉమర్ గుల్ 85 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: జట్టు సీఈవోతో గొడవ.. ఏకంగా కెప్టెన్సీ నుంచే తీసేసారు!