ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ బౌలర్ ఉమర్ గుల్ నియమితుడయ్యాడు. అతడు ఏప్రిల్4న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో చేరునున్నాడు. కాగా గుల్‌కు దేశీయ స్థాయిలో, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అదే విధంగా లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే గ్లాడియేటర్స్ బౌలింగ్ కోచ్‌గా కూడా ఉమర్ గుల్ పనిచేశాడు.
కాగా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఉమర్ గుల్ వెల్లడించాడు. "పిఎస్‌ఎల్, కెపిఎల్, ఎల్‌పిఎల్ ,దేశీయ స్థాయిలో కోచింగ్ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. నా అనుభవంతో ఆఫ్ఘన్ బౌలర్లకు సహాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను" అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు.
Honoured to be taking up this role with the @ACBofficials . Looking forward to imparting the best of the knowledge that i have and making it worth it for the boys. https://t.co/ouIYa0St2t
— Umar Gul (@mdk_gul) April 1, 2022
Comments
Please login to add a commentAdd a comment