భారత గడ్డపై అతిథులుగా... హైదరాబాద్‌లో ఆడనున్న జట్లు ఇవే | ICC ODI World Cup 2023: Team Afghanistan Arrived In India, Know Where All The Teams Staying In Hyderabad - Sakshi
Sakshi News home page

ICC World Cup 2023: భారత గడ్డపై అతిథులుగా... హైదరాబాద్‌లో ఆడనున్న జట్లు ఇవే

Sep 27 2023 12:02 PM | Updated on Oct 3 2023 7:41 PM

ICC World Cup 2023 Afghanistan Team Land In India - Sakshi

భారత గడ్డపై అఫ్గనిస్తాన్‌ క్రికెటర్లకు స్వాగతం

ICC ODI World Cup 2023 Teams In India- Hyderabad: వన్డే వరల్డ్‌ కప్‌-2023లో పాల్గొనే జట్లు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ ఇప్పటికే భారత్‌లో ఉండగా... మంగళవారం అఫ్గానిస్తాన్‌ బృందం తిరువనంతపురం చేరింది. న్యూజిలాండ్‌ టీమ్‌ రెండు బృందాలుగా భారత్‌కు చేరుకుంటోంది.

బంగ్లాదేశ్‌తో మంగళవారం చివరి వన్డే ఆడిన టీమ్‌ బుధవారం హైదరాబాద్‌కు రానుండగా... కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సహా ఇతర ప్రధాన ఆటగాళ్లతో కూడిన జట్టు మంగళవారం రాత్రి పది గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో అడుగు పెట్టింది. పాకిస్తాన్‌ కూడా బుధవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకుంటుంది.  

వరల్డ్ కప్ 2023 సందర్భంగా హైదరాబాద్‌లో క్రికెటర్ల సందడి
ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మొత్తంగా 5 మ్యాచులు జరుగనున్నాయి.  ఇందులో రెండు ప్రాక్టీస్ మ్యాచులు(Sep 29th Pak vs NZ warmup match, Oct 3rd Pak vs aus warmup match), మూడు ప్రధాన మ్యాచ్‌లు(Oct 6 Pak vs Netherlands, Oct 9 Newzeland vs Netherlands, Oct 10 Pak vs srilanka) ఉన్నాయి. 

ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10 గంటలకు  న్యూజిలాండ్‌ టీమ్‌ శంషాబాద్  చేరుకోగా.. బుధవారం రాత్రి 10 గంటలకు పాకిస్తాన్ , శ్రీలంక జట్టు హైదరాబాద్‌ గడ్డపై అడుగుపెట్టనున్నాయి. 

హైదరాబాద్‌లో వివిధ హోటల్స్ లో బస చేయనున్న టీమ్స్ 
►ఐటీసీ కాకతీయలో న్యూజిలాండ్ జట్టు 
►పార్క్ హయత్‌తో పాకిస్తాన్ 
►తాజ్ కృష్ణలో ఆస్ట్రేలియా 
►తాజ్ కృష్ణలో నెదర్లాండ్స్‌
►శంషాబాద్ నోవొటెల్లో శ్రీలంక.

చదవండి: 34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్‌ శర్మ, డేవిడ్‌ మిల్లర్‌ రికార్డు బద్దలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement