భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు భారత ప్రాథమిక జట్టు ఇదే అంటూ సోషల్‌మీడియా కోడై కూస్తుంది. కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా తమ కోర్ టీమ్‌ను ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రాథమిక జట్టు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఇదే భారత కోర్ టీమ్ అంటూ సోషల్‌మీడియాలో 19 మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
వైరలవుతున్న జట్టులో పెద్దగా సంచలనాలు ఏవీ లేనప్పటికీ.. ఒక్క పేరు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గాయాల కారణంగా చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. సంజూ శాంసన్, ముకేశ్ కుమార్‌లతో పాటు జయదేవ్ ఉనద్కత్ అనూహ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇక అందరూ ఊహించిన విధంగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్,శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చహల్ జట్టులో ఉండనే ఉన్నారు. బీసీసీఐ ఇదే జట్టును ఆసియా కప్ బరిలో కూడా దించనున్నట్లు తెలుస్తుంది. కాగా, వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని జట్లు సెప్టెంబర్ 27లోగా తమతమ పూర్తి జట్లను ప్రకటించాలని ఐసీసీ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే.
ఆసియా కప్, వరల్డ్ కప్‌లకు భారత కోర్ టీమ్ ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనద్కత్, ముకేశ్ కుమార్, యుజ్వేద్ర చహల్
Comments
Please login to add a commentAdd a comment