హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్‌ | Sri Lankan Cricketer Shehan Madushanka Caught With Heroin | Sakshi
Sakshi News home page

హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్‌

Published Tue, May 26 2020 12:11 AM | Last Updated on Tue, May 26 2020 9:31 AM

Sri Lankan Cricketer Shehan Madushanka Caught With Heroin - Sakshi

కొలంబో: శ్రీలంక క్రికెట్‌ జట్టు యువ పేస్‌ బౌలర్‌ షెహాన్‌ మధుశంక హెరాయిన్‌తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. లంకలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆదివారం కారులో మరో వ్యక్తితో కలిసి ప్రయాణిస్తోన్న 25 ఏళ్ల మధుశంకను పన్నాల పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద రెండు గ్రాముల హెరాయిన్‌ దొరికింది. పోలీసులు మేజిస్ట్రేట్‌ వద్ద ప్రవేశపెట్టగా... రెండు వారాలపాటు రిమాండ్‌కు తరలించింది. బంగ్లాదేశ్‌తో 2018లో అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగిన మధుశంక, ఆ తర్వాత రెండు టి20ల్లోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement