కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 30 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. మొదట ఫైజాబాద్ సమీపంలో రాత్రి 12:28 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 నమోదైంది. మళ్లీ రాత్రి 12:55 గంటలకు మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఈసారి ఫైజాబాద్‌కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో భూకంపం కనిపించింది. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రత ఉన్నట్లు సమాచారం. ఈ విపత్తులో ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల డిసెంబర్ 12, 2023నే భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అంతకు ముందు గత ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రమాదంలో బలమైన ప్రకంపనల కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. ఆఫ్గనిస్థాన్‌లో గత రెండు దశాబ్దాలలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో సుమారు 2,000 మంది మరణించారు.
ఇదీ చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Comments
Please login to add a commentAdd a comment