హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో పర్యాటక అఫ్గాన్ జట్టు సొంతం చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జింబాబ్వేను దెబ్బతీశాడు.
అఫ్గాన్ బౌలర్లలో రషీద్‌తో పాటు ఓమర్జాయ్, నవీన్ ఉల్ హాక్, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాధవిరే(21), మజకజ్దా(17) పరుగులతో రాణించారు.
అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు అఫ్గానిస్తాన్ తీవ్రంగా శ్రమించింది. 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అఫ్గాన్ బ్యాటర్లలో ఒమర్జాయ్(34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నబీ(24 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, గ్వాండు, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment