
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అఫ్గాన్ టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌కు అఫ్గానిస్తాన్ క్రికెట్ సెలక్టర్లు.. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే విధంగా ప్రపంచ కప్‌లో పాల్గొనే అఫ్గాన్ జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) ప్రకటించింది. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన అనంతరం టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు.
Afghanistan National Cricket Team Squad for the World T20 Cup 2021. pic.twitter.com/exlMQ10EQx
— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2021
‘బాధ్యతయుతమైన జట్టు కెప్టెన్‌గా టీ20 జట్టు ఎంపికలో భాగమయ్యే హక్కును కలిగిఉన్నాను. కానీ, సెలక్షన్ కమిటీ, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) కనీసం నా అభిప్రాయం తీసుకోలేదు. నేను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను దేశం తరఫున ఆడేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0
— Rashid Khan (@rashidkhan_19) September 9, 2021
Comments
Please login to add a commentAdd a comment