captency
-
కెప్టెన్సీ మాకు వద్దు అంటూ ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి..!
-
అఫ్గాన్ టీ20 జట్టు: కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అఫ్గాన్ టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌కు అఫ్గానిస్తాన్ క్రికెట్ సెలక్టర్లు.. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే విధంగా ప్రపంచ కప్‌లో పాల్గొనే అఫ్గాన్ జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) ప్రకటించింది. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన అనంతరం టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. Afghanistan National Cricket Team Squad for the World T20 Cup 2021. pic.twitter.com/exlMQ10EQx — Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2021 ‘బాధ్యతయుతమైన జట్టు కెప్టెన్‌గా టీ20 జట్టు ఎంపికలో భాగమయ్యే హక్కును కలిగిఉన్నాను. కానీ, సెలక్షన్ కమిటీ, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) కనీసం నా అభిప్రాయం తీసుకోలేదు. నేను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను దేశం తరఫున ఆడేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0 — Rashid Khan (@rashidkhan_19) September 9, 2021 -
చెత్త రికార్డు: లారాను దాటేసిన కోహ్లి
పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్‌లో చేసిన సెంచరీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. భారత్ ఘోర పరాజయంతో అతడి కెప్టెన్సీ కెరీర్లో చెత్త రికార్డు కూడా నమోదైంది. పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 146 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో కోహ్లి 25వ సెంచరీ వృధాగా పోయింది. తాను సెంచరీ కొట్టినా జట్టు ఓడిపోవడం కోహ్లికి ఇది ఏడోసారి కావడం గమనార్హం. కెప్టెన్‌గా సెంచరీ చేసినా టీమ్ ఓడిపోవడం అతడికిది ఆరోసారి. ఇంతకుముందు వెస్టిండీస్ బ్రియన్ లారా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. లారా సెంచరీలు చేసిన ఐదుసార్లు విండీస్ ఓడిపోయింది. వీరి తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఉన్నాడు. అతడు నాలుగు పర్యాయాలు శతకాలు బాదినప్పుడు ఆసీస్ పరాజయం పాలైంది. 15వ ఓటమి పెర్త్ టెస్ట్ ఓటమి టీమిండియా చెత్త రికార్డును మరింత ముందుకు తీసుకెళ్లింది. గత 15 ఏళ్లలో 200, అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి ఓడిపోవడం భారత క్రికెట్ జట్టుకు ఇది 15వ సారి కావడం గమనార్హం. భారత్ చివరిసారిగా 2003లో అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌లో 200 పైగా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఛేజింగ్‌లో టీమిండియా ఈ ఏడాది ఆరుసార్లు ఓడిపోయింది. కేప్‌టౌన్(టార్గెట్ 208), సెంచూరియన్(287), బర్మింగ్‌హామ్(194), సౌతాంప్టన్ (245), ఓవల్ (464), పెర్త్ (287) టెస్టుల్లో చతికిలపడింది. -
మిథాలీ రాజ్‌కే పగ్గాలు
♦ ఆస్ట్రేలియాలో పర్యటనకు ♦ భారత మహిళల జట్టు ఎంపిక ♦ ఆంధ్ర అమ్మాయి కల్పనకు చోటు న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఈనెలలో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల వన్డే, టి20 జట్లకు నాయకత్వం వహించనుంది. ఈనెల 26న మొదలయ్యే ఈ సిరీస్ వచ్చే నెల ఏడో తేదీతో ముగుస్తుంది. ఈ సిరీస్‌లో భారత్ మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. 15 మంది సభ్యుల బృందానికి పేస్ బౌలర్ జులన్ గోస్వామి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. వన్డే జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, వికెట్ కీపర్ రావి కల్పనకు స్థానం లభించింది. టి20 జట్టులో కల్పన, పూనమ్ రౌత్, స్నేహ రాణే స్థానాల్లో వనిత, అనూజా పాటిల్, దీప్తి శర్మలను ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జనవరి 26న (అడిలైడ్), రెండో టి20 మ్యాచ్ జనవరి 29న (మెల్బోర్న్), మూడో టి20 మ్యాచ్ జనవరి 31న (సిడ్నీ) జరుగుతాయి. ఫిబ్రవరి 2న తొలి వన్డే (కాన్బెర్రా), 5న రెండో వన్డే, 7న మూడో వన్డే (హోబర్ట్) జరుగుతాయి. చివరిసారి భారత మహిళల జట్టు 2008లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 0-5తో ఓడిపోయింది. భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి (వైస్ కెప్టెన్), స్మృతి మంధన, తిరుష్ కామిని, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, నిరంజన, సుష్మా వర్మ, రావి కల్పన, ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ రౌత్, పూనమ్ యాదవ్, స్నేహ రాణే.