T20 cricket team
-
క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు 'కింగ్ కోహ్లి'.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లి క్రికెట్ చర్రితలో ఏ ఆటగాడికి సాధ్యం కాని ఓ అత్యంత అరుదైన ఘనతను ఇవాళ (జనవరి 23) సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన 2022 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న కోహ్లి.. ఐసీసీ మూడు ఫార్మాట్ల క్రికెట్ జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. •ICC Test team of the year. •ICC ODI team of the year. •ICC T20 team of the year. Virat Kohli is the only player to feature or to be part of the ICC's years team in all three formats.!! — CricketMAN2 (@ImTanujSingh) January 23, 2023 2012, 2014, 2016, 2017, 2018, 2019 ఐసీసీ వన్డే జట్లలో చోటు సంపాదించిన కింగ్.. 2017, 2018, 2019 ఐసీసీ టెస్ట్ టీమ్‌ల్లోనూ సభ్యుడిగా ఎంపిక కాబడ్డాడు. తాజాగా 2022 ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న రన్‌మెషీన్.. ఐసీసీ బెస్ట్ టెస్ట్ (3), వన్డే (6), టీ20 జట్ల (1)లో భాగమైన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతేడాది పొట్టి ఫార్మాట్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన కింగ్.. ఆసియాకప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ సెంచరీ, టీ20 వరల్డ్‌కప్-2022లో పాకిస్తాన్‌పై అజేయమైన హాఫ్‌సెంచరీ తదితర మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడి బెస్ట్ టీ20-2022 జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది సూపర్ ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్న కోహ్లి.. 2023లో వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో కింగ్ ఇప్పటికే 2 సెంచరీలు (శ్రీలంకపై) బాదాడు. న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న పరుగుల యంత్రం, ఆతర్వాత ఆసీస్‌తో జరిగే 4 మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. కాగా, ఐసీసీ ప్రకటించిన 2022 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టులో చోటు కోహ్లితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు కూడా చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు సారధి జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస
లండన్: ఇంగ్లండ్ జాతీయ జట్టుకు 2011-2014 మధ్యలో 24 వన్డేలు, 34 టీ20లు ఆడిన జేడ్ డెర్న్‌బాచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలంగా జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోవడంతో ఇంగ్లండ్‌ను వీడి మరో దేశానికి ప్రాతినధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2022 ఐరోపా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇటలీ జట్టు తరఫున ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. తన తల్లి ద్వారా ఇదివరకే ఇటలీ పాస్ పోర్ట్ కలిగిన డెర్న్‌బాచ్.. మాజీ సహచర ఆటగాడు ప్రస్తుత ఇటలీ కోచ్ కమ్ కెప్టెన్ గారెత్ బెర్గ్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. డెర్న్బాచ్తో పాటు కెంట్ కౌంటీ జట్టు ఆటగాడు గ్రాండ్ స్టువార్ట్ కూడా ఈ ప్రపంచకప్ క్వాలిపయర్స్లో ఇటలీకి ఆడనున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఓవైస్ షా ఇటలీ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో కోచ్, అసిస్టెంట్ కోచ్, ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతనిధ్యం వహించనున్నారు. ఇదిలా ఉంటే, 35 ఏళ్ల వెటరన్ బౌలర్ జేడ్ డెర్న్‌బాచ్.. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 31, టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు. అతను ప్రస్తుతం సర్రే కౌంటీ జట్టు కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. చదవండి: పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్ -
అఫ్గాన్ టీ20 జట్టు: కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అఫ్గాన్ టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌కు అఫ్గానిస్తాన్ క్రికెట్ సెలక్టర్లు.. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే విధంగా ప్రపంచ కప్‌లో పాల్గొనే అఫ్గాన్ జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) ప్రకటించింది. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన అనంతరం టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. Afghanistan National Cricket Team Squad for the World T20 Cup 2021. pic.twitter.com/exlMQ10EQx — Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2021 ‘బాధ్యతయుతమైన జట్టు కెప్టెన్‌గా టీ20 జట్టు ఎంపికలో భాగమయ్యే హక్కును కలిగిఉన్నాను. కానీ, సెలక్షన్ కమిటీ, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) కనీసం నా అభిప్రాయం తీసుకోలేదు. నేను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను దేశం తరఫున ఆడేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0 — Rashid Khan (@rashidkhan_19) September 9, 2021 -
టీ20లో 'జేజమ్మ'
భారత మహిళల క్రికెట్ జట్టులో నగరం నుంచి మరో అమ్మాయి స్థానందక్కించుకుంది. ఇప్పటికే మిథాలీరాజ్‌కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా... మరికొంత మంది ఇండియన్ ఉమెన్స్ టీమ్‌లో ఆడగా, ఇప్పుడు మరో అమ్మాయి జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం.నగరంలోని డిఫెన్స్ కాలనీకి చెందినఅరుంధతీరెడ్డి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైంది.ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలు... సాక్షి, సిటీబ్యూరో :ఆధునిక యువతులు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. ఆకాశంలో,అవకాశాల్లో తమ ముద్రతో ప్రగతిపథాన సాగుతున్నారు. క్రీడల్లోనూ ఎదుగుతూ పురుషులకు తామేమీ తీసిపోమనినిరూపిస్తున్నారు. ఆ కోవకు చెందిన యువతే అరుంధతి. భారత మహిళల టీ–20 జట్టులోకి ఎంపికయ్యింది. 21 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టనుంది. నగరంలోని సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీకి చెందిన అరుంధతిరెడ్డి ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈ క్రమంలోక్రికెట్ ప్రపంచంలో తన ప్రస్థానం. అంచలంచెలుగా ఎదిగిన విధానం. ఎదుర్కొన్న ఇబ్బందులుమహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన విశేషాలను, అనుభవాలను పంచుకుందిలా.. - చైతన్య వంపుగాని అన్న ఆడుతుంటే చూసేదాన్ని.. అన్న రోహిత్ మంచి క్రికెటర్. ప్రతిరోజూ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాడు. అన్నవాళ్లు ఆడుతుంటే బయట నిలబడి ఆటను చూస్తూ బాల్స్ అందించేదాన్ని. ప్రాక్టీస్ అనంతరం పిల్లలందరం కలిసి గల్లీలో క్రికెట్ ఆడేవాళ్లం. మళ్లీ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాళ్లం. దీంతో క్రికెట్‌పై ఆసక్తి బాగా పెరిగింది.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాలనే ఆకాంక్ష ఎక్కువైంది. ప్రతిరోజూ జింఖానాగ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసేదాన్ని. మిథాలీ బ్యాటింగ్ స్టైల్‌కు ఫిదా ఇండియన్ టీం కెప్టెన్ మిథాలీరాజ్ ఆటను చూస్తూ పెరిగాను. ఆమెను నేను అక్కా అని పిలుస్తా. రెండేళ్ల క్రితం సౌత్ సెంట్రల్ రైల్వేస్‌కు సెలెక్ట్ అయినప్పుడు మిథాలీ అక్కతో నాకు మరింత అనుబంధం పెరిగింది. కోచ్ మూర్తి సర్ కూడా 3, 4 గంటల పాటు మిథాలీ బ్యాటింగ్ ఎలా చేస్తుందో గమనించు, నేర్చుకో అని చెప్పేవారు. మిథాలీ అక్క షాట్లకు ఫిదా అయ్యాను. అమ్మ ప్రోత్సాహం మరువలేను.. మా అమ్మ పేరు భాగ్య. ఆమె మంచి వాలీబాల్ ప్లేయర్. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను ఆటను మధ్యలో వదిలేసింది. ప్రస్తుతం టీచర్‌గా చేస్తోంది. నా ప్రాక్టీస్ కోసం తెల్లవారుజామున 3గంటలకు నిద్రలేచే వాళ్లం. ప్రాక్టీస్ 9.30 గంటల దాకా చేసేదాన్ని. మళ్లీ సాయంత్రం 4 గంటలకు గ్రౌండ్‌కు వచ్చేవాళ్లం. రాత్రి 7.30గంటల వరకు అమ్మ కూడా నాతోనే ఉండేది. అమ్మ నా కోసం ఎంతో కష్టపడింది. నేను ఈ స్థాయికి ఎదగడానికి ఆమె శ్రమ, ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇండియా ‘గ్రీన్’తో అందరి దృష్టిలో పడ్డా.. ఇటీవల జరిగిన ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో ‘ఇండియా గ్రీన్’ టీంలో ఆడాను. ‘ఇండియా బ్ల్యూ’ టీంలో మిథాలీ ఉన్నారు. ఓ మ్యాచ్‌లో నేను మిథాలీని బౌల్డ్ చేశాను. అన్ని మ్యాచ్‌ల్లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాను. దీంతో భారత టీ20 జట్టులో అవకాశం దక్కింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లివే.. ఇప్పటి వరకు అండర్– 19, 23, సీనియర్స్, సీనియర్ జోనల్స్, ఛాలెంజర్స్, ఇండియా ‘ఎ’, సౌత్ సెంట్రల్ రైల్వేస్ మ్యాచ్‌లలో ఆడాను. వీటన్నింటిలో ఆల్‌రౌండర్ ప్రతిభను కనబరిచా. సెప్టెంబర్ 19 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్ ఉంది. వీటిలో సత్తా చాటి మున్ముందు వన్డేల్లోకి కూడా ఎంపికవుతాననే నమ్మకముంది. అనన్య మెసేజ్‌తో సర్ప్రైజ్ ఈ నెల 23న ఎప్పటిలాగానే క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేశా. సాయంత్రం 6.30గంటలకు ఇంటికి బయలుదేరుతూ.. టేబుల్లో ఉన్న ఫోన్ తీసి చెక్ చేస్తుంటే నా స్నేహితురాలు అనన్య ఉపేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది. ‘కంగ్రాట్స్ డియర్.. యూ ఆర్ సెలక్టెడ్ ఇన్ ఇండియా టీ20 టీమ్’ అని ఉంది. ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి. ఆ వెంట వెంటనే ఎనిమిది మంది నుంచే కంగ్రాట్స్ మెసేజెస్ వచ్చాయి. వెంటనే అమ్మకు ఫోన్ చేసి ‘అమ్మా.. నేను ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యానని చెప్పాను’. ఆ తర్వాత కెనడాలో ఉన్న అన్న రోహిత్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఇంటికి వెళ్లేసరికి బంధువులు, స్నేహితులు ఫ్లవర్ బొకేస్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. మహిళా క్రికెట్‌కు ఆదరణ.. మహిళా క్రికెట్‌పై అందరిలోనూ ఆదరణ పెరుగుతోంది. చాలామంది అమ్మాయిలు క్రికెట్ వైపు చూస్తున్నారు. అరుంధతికి ఎన్నో సలహాలు ఇచ్చాను. ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నా పేరు ఒక్కటే వినిపించేది. ఇప్పుడు నాతో పాటు అరుంధతి పేరు అంతర్జాతీయంగా వినిపించడం ఎంతో ఆనందంగా ఉంది. అరుంధతిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎంతో మంది ముందుకు రావాలి.– మిథాలీరాజ్, భారత మహిళల వన్డేజట్టు కెప్టెన్ నాకెంతో గర్వంగా ఉంది అరుంధతి అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం నాకెంతో గర్వంగా ఉంది. రెండేళ్ల పాటు సౌత్‌సెంట్రల్ రైల్వేస్ తరఫున ఆడిన సమయంలో తన పట్టుదలను పసిగట్టాను. కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ ఎంపికవుతుందనే నమ్మకం వచ్చింది. మిథాలీ తర్వాత అరుంధతి ఇండియన్ జట్టులో చోటు సంపాదించడం సంతోషంగా ఉంది. – రాయప్రోలు మూర్తి, కోచ్ -
సచిన్ ఆడినప్పుడు.. నెహ్రాకు ఏంటి..?
సాక్షి, న్యూఢిల్లీ: 40 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఆడినపుడు.. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా విషయంలో వచ్చిన సమస్య ఏమిటని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించారు. ఆసీస్ తో మూడు టీ20లకు ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో నెహ్రాకు అనూహ్యంగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అయితే రైనా, యువరాజ్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కకుండా ఈ సీనియర్ బౌలర్‌కు అవకాశం రావడం పట్ల క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్లు మాత్రం ఈ విషయంలో సెలక్టర్లను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే గంగూలీ క్రికెట్ కు వయస్సుతో సంబంధం లేదని నెహ్రా ఎంపికపట్ల మద్దతుగా నిలవగా తాజాగా సెహ్వాగ్ ఆ జాబితాలో చేరారు. ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ‘నెహ్రా ఎంపిక నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అతను జట్టులో చోటు దక్కించుకోవడం చాల సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్ లు ఆడాలని కోరుకుంటున్నా. నెహ్రా ఎంపిక వెనుక ఉన్న రహస్యం అతని ఫిట్ నెస్. అతను అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడనప్పుడు పూర్తి సమయాన్ని జిమ్ కే కేటాయిస్తాడు. అంతేగాకుండా ఆటగాళ్లకు నిర్వహించే ఫిట్నెస్ పరీక్ష యో-యో టెస్టులో నెహ్రా 18 స్కోరు సాధించాడు. ఇది దాదాపు కోహ్లి స్కోరుకు సమానం. ఫిట్‌నెస్‌కు అతని హైట్ కలిసొచ్చే అంశం. ఫాస్ట్ బౌలర్ కావడంతో పరుగులో కూడా ఎలాంటి సమస్య లేదు. క్రికెట్ ఆడటానికి వయస్సుతో సంబంధం లేదని నేను భావిస్తాను. శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య 42 ఏళ్ల వయసులో, సచిన్ 40 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడలేదా? అలాంటప్పుడు ఫిట్‌గా ఉన్న నెహ్రాకు వచ్చిన సమస్య ఏమిటి? యువరాజ్, రైనాలు యో-యో టెస్టు అర్హత సాధించలేకపోవడంతో జట్టులో వారికి చోటు దక్కలేదు. క్రికెట్లో కొనసాగాలంటే ఫిట్నెస్ ముఖ్యం. ఫిట్‌గా ఉంటే హిట్ చేయవచ్చు. ప్రస్తుత జట్టులో అన్‌ఫిట్ ఎవరూ లేరు’. అని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. -
‘నిక్ నేమ్’లోనేముంది!
ఢాకా: బిజోయ్, శుభో, మిటు, మొయినా, బాతుల్, పేట్లా, మాష్, కౌశిక్, లల్లా, శిప్లు, షౌరోభ్...ఈ జాబితా ఏమిటి అనుకుంటున్నారా. వీరంతా బంగ్లాదేశ్ టి20 క్రికెట్ జట్టు సభ్యులు. అదేంటీ పేర్లన్నీ కొత్తగా, ఇంకా చెప్పాలంటే వింతగా ఉన్నాయంటారా! అవును... ఇవన్నీ బంగ్లా క్రికెటర్ల ముద్దు పేర్లు! ఆ దేశ జాతీయ జట్టులో దాదాపు ప్రతీ ఆటగాడికి ఏదో ఒక నిక్‌నేమ్ ఉంది. కొందరికి ఆట వల్లో, శరీరాన్ని బట్టో పేర్లు పెడితే, మరి కొందరికి ఎందుకు అది పెట్టారో తెలీకుండానే వారి నిక్‌నేమ్ స్థిర పడిపోయింది. మైదానంలో ఆట సాగినంత సేపు వారు ఆ పేర్లతోనే సహచరులను పిలుచుకుంటారు. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు మొయినా అని ముద్దు పేరు. ఇది మైనా పక్షిని దృష్టిలో ఉంచుకొని పెట్టిన పేరు. బంగ్లా జాతీయ అకాడమీలో షకీబ్ చురుకుదనం చూసి సీనియర్ నయీమ్ ఈ పేరు ఇచ్చాడు. ‘మా జట్టులో దాదాపు అందరికీ నిక్‌నేమ్‌లు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి ఎవరో అనడం, అదే పిలవడం అలవాటైంది. కొంతమందికి ఆ నిక్‌నేమ్‌లు ఎందుకు వచ్చాయో ఎవరికీ తెలీదు’ అని షకీబ్ చెప్పాడు. బిజో (అనాముల్ హక్), శుభో (షంసుర్ రహమాన్), శిప్లు (రోబియుల్ ఇస్లామ్) ఇలాంటివే! అదే విధంగా తమీమ్ ఇక్బాల్ భారీ కాయం కారణంగా పోట్లా, ముష్ఫికర్ రహీమ్ పొట్టి సైజు కారణంగా బాతుల్ అని పేర్లు పెట్టారు. కెప్టెన్ రహీమ్‌కు ముద్దుగా ‘మిటు’ అనే పేరు కూడా ఉంది. పేసర్ మష్రాఫ్ మొర్తజా (మాష్, కౌశిక్), రజాక్ (ఆఫ్రిది అభిమానిగా లల్లా)లకు కూడా నిక్నేమ్లున్నాయి. ఇక గంగూలీ శైలిలో ఆడే మోమినుల్ హక్‌ను షౌరోభ్ అని పిలుచుకుంటారు!