ICC Warns Afghanistan Cricket Team: క్రికెట్ బోర్డుల వ్యవహారాల్లో ఆయా దేశాల ప్రభుత్వాల జోక్యాన్ని సహించేది లేదని ఐసీసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెలలో ఆఫ్గనిస్థాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఆ దేశ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధ్యక్షడిని సైతం మార్చేసి వారికి అనుకూలంగా ఉండే వ్యక్తిని నియమించుకోవడంతో పాటు ఆ దేశ అమ్మాయిలను క్రికెట్ ఆడకుండా నిషేధించారు.
ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ జాతీయ పతాకానికి బదులు తమ జెండా పెట్టాలని తాలిబన్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే.. అఫ్గాన్ జట్టును బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే ఐసీసీ నియమాలు తప్పకుండా పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు మొత్తం 8 జట్లు అర్హత సాధించగా, అందులో అప్గాన్ జట్టు ఒకటి. ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో బలమైన జట్టుగా ఎదిగిన అఫ్గానిస్థాన్ జట్టు ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉంది.
చదవండి: ఆ క్రికెట్ సిరీస్ కోసం ఇద్దరు ప్రధానుల మధ్య చర్చ..
Comments
Please login to add a commentAdd a comment