
Afghanistan Beat Bangladesh To Level Series: 3 వన్డేలు, 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న అఫ్ఘనిస్థాన్, ఆతిధ్య జట్టుకు షాకిచ్చింది. శనివారం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన అఫ్ఘాన్ జట్టు.. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. అఫ్ఘాన్ బౌలర్లు అజ్మతుల్లా(3/22), ఫజల్ హాక్ ఫరూఖి(3/18)ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం ఛేదనలో హజ్రతుల్లా జజాయ్ (45 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఉస్మాన్ ఘనీ (48 బంతుల్లో 47; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో అఫ్ఘన్ జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు. కాగా, మార్చి 3న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ చెలరేగి ఆడిన ఆతిధ్య జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
చదవండి: PAK Vs AUS: డబుల్ చేజార్చుకున్న అజహర్ అలీ.. పాక్ భారీ స్కోర్