అఫ్గనిస్తాన్ స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో 23 ఏళ్ల వయస్సులోపు అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా జద్రాన్ నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2203లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో జద్రాన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో జద్రాన్ ఇప్పటివరకు 376 పరుగులు చేశాడు.
కాగా ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. 1992 వరల్డ్‌కప్‌లో లారా 333 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా రికార్డును జద్రాన్ బద్దలు కొట్టాడు. కాగా అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 1996 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో సచిన్ ఏకంగా 523 పరుగులు సాధించాడు.
చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment