వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ 45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ(58 నాటౌట్), ఒమర్జాయ్(72 నాటౌట్), రెహమత్ షా(62) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
శ్రీలంక బౌలర్లలో మధుశంక రెండు, రజితా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సంక(46),కుశాల్ మెండిస్ (39), సమరవిక్రమ (36) టాప్ స్కోరర్లగా నిలిచారు.
ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 4, ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంతో అఫ్గాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. కాగా వన్డే వరల్డ్‌కప్‌లలో శ్రీలంకపై అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా ఈ టోర్నీలో అంతకుముందు ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను అఫ్గాన్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
చదవండి: World Cup 2023: పాకిస్తాన్ క్రికెట్‌లో మరో వివాదం.. బాబర్ ఆజం ప్రైవేట్ చాట్ లీక్
Comments
Please login to add a commentAdd a comment