నెదర్లాండ్ ఫాస్ట్ బౌలర్ వివియన్ కింగ్మా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో కింగ్మా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 3ని ఉల్లంఘించినందుకు కింగ్మాపై నాలుగు మ్యాచ్‌ల నిషేదాన్ని ఐసీసీ విధించింది. అంతేకాకుండా క్రమశిక్షణా రికార్డులో ఐదు డీమెరిట్ పాయింట్లు కూడా వచ్చి చేరాయి.
ఏం జరిగిందంటే..
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 31వ ఓవర్ బౌలింగ్ వేసిన కింగ్మా తన చేతి గోళ్లతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు. కింగ్మా తన నేరాన్ని అంగీకరించడంతో నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని మ్యాచ్ రిఫరీ విధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో పది ఓవర్లు బౌలింగ్ వేసిన కింగ్మా ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నెదర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంలో బ్యాటర్లు రియాజ్ హుసాన్(50 పరుగులు), నజీబుల్లా(71 పరుగులు) అర్ధ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు.
చదవండి: హార్ధిక్ పాండ్యా నాన్నమ్మనూ వదలని "పుష్ప" ఫోబియా.. తగ్గేదేలే అంటున్న బామ్మ
Comments
Please login to add a commentAdd a comment