ఈ క్రికెటర్‌ ఎవరో గుర్తు పట్టారా? | ICC Conduts a Quiz on Cricketer | Sakshi
Sakshi News home page

ఈ క్రికెటర్‌ ఎవరో గుర్తు పట్టారా?

Published Tue, May 19 2020 11:44 AM | Last Updated on Tue, May 19 2020 11:53 AM

ICC Conduts a Quiz on Cricketer - Sakshi

అండర్‌వేర్‌లా కనిపిస్తున్నదానిని మొహంపై ధరించిన ఓ ప్రముఖ క్రికెటర్‌ ఫోటోను, ఐసీసీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అతనెవరో గుర్తుపట్టారా అంటూ సరదాగా ప్రశ్నించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో అతను తన దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌. వన్డే మ్యాచ్‌లలో 50 వికెట్లు కూడా పడగొట్టాడు అంటూ కొన్ని హింట్లను కూడా ఇచ్చింది.

ఇప్పటికీ ఈ క్రికెటర్‌ ఎవరో గుర్తుపట్ట లేదా.. అంటూ మరిన్ని హింట్లను కూడా ఇచ్చింది. 2011లో ఇంగ్లాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేశాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో అత్యధిక సగటు(వేయి పరుగుల వరకు మాత్రమే) నమోదు చేసింది కూడా ఇతనే అంటూ మరిన్ని హింట్లను ఇచ్చింది. 

అతనెవరో కాదు ర్యాన్‌ టెన్‌ డోస్చేట్‌. నెదర్లాండ్‌ తరపును అత్యధిక పరుగులు(2074) సాధించిన క్రికెటర్‌. ఇక బౌలింగ్‌లోనూ సత్తాచాటి 55 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో కేవలం 32 మ్యాచ్‌లు ఆడి, 67 సగటుతో 1541 పరుగు చేశాడు. 5 సెంచరీలు చేయగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇంగ్లాండ్‌తో 2011 జరిగిన మ్యాచ్‌లో(119) నమోదు చేశాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement