న్యూఢిల్లీ: క్రికెట్‌లో వానొచ్చినపుడుల్లా వినిపించే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూశారు. అయితే ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలువడింది. 84 ఏళ్ల డక్‌వర్త్ ఈ నెల 21నే వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. కానీ ఓ వెబ్‌సైట్ ద్వారా మంగళవారం ఆ వార్త వెలుగులోకి వచ్చి0ది.
ఇక డీఎల్ విషయానికొస్తే డక్‌వర్త్, లూయిస్ ఇద్దరు కలిసి ఆవిష్కరించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి 1997లో అమలు చేసింది. తదనంతరం ఆ్రస్టేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్... డీఎల్‌కు కొన్ని మార్పుచేర్పులు చేశారు.
అప్పటి నుంచి డీఎల్ కాస్త డక్‌వర్త్–లూయిస్–స్టెర్న్ (డీఎల్‌ఎస్)గా స్థిరపడింది. క్రికెట్‌లో వాన ముంచెత్తితే మ్యాచ్ రద్దవుతుంది. వాన పడి ఆగిపోయాక నిర్వహిస్తే, లేదంటే అప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో ఫలితాన్ని తేల్చాలంటే, లక్ష్యాన్ని సవరించాలంటే డీఎల్‌ఎస్‌నే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment