duckworth lewis
-
‘డక్‌వర్త్’ కన్నుమూత
న్యూఢిల్లీ: క్రికెట్లో వానొచ్చినపుడుల్లా వినిపించే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూశారు. అయితే ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలువడింది. 84 ఏళ్ల డక్‌వర్త్ ఈ నెల 21నే వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. కానీ ఓ వెబ్సైట్ ద్వారా మంగళవారం ఆ వార్త వెలుగులోకి వచ్చి0ది. ఇక డీఎల్ విషయానికొస్తే డక్‌వర్త్, లూయిస్ ఇద్దరు కలిసి ఆవిష్కరించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి 1997లో అమలు చేసింది. తదనంతరం ఆ్రస్టేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్... డీఎల్‌కు కొన్ని మార్పుచేర్పులు చేశారు. అప్పటి నుంచి డీఎల్ కాస్త డక్‌వర్త్–లూయిస్–స్టెర్న్ (డీఎల్ఎస్)గా స్థిరపడింది. క్రికెట్లో వాన ముంచెత్తితే మ్యాచ్ రద్దవుతుంది. వాన పడి ఆగిపోయాక నిర్వహిస్తే, లేదంటే అప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో ఫలితాన్ని తేల్చాలంటే, లక్ష్యాన్ని సవరించాలంటే డీఎల్‌ఎస్‌నే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. -
IPL 2023: పంజాబ్‌దే పైచేయి
మొహాలి: సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం మాజీ చాంdపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు కీలక వికెట్లతో పంజాబ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్ (3/19)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రాజపక్స (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరిపించగా... శిఖర్ ధావన్ (29 బంతుల్లో 40; 6 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. పంజాబ్ ఇన్నింగ్స్ ముగిశాక మైదానంలో ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ అరగంట ఆలస్యంగా మొదలైంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో భారీ వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో ఆట సాధ్యపడలేదు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 16 ఓవర్ల వరకు కోల్‌కతా విజయ సమీకరణం 154 పరుగులుగా ఉంది. 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కోల్‌కతాను రసెల్ (19 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించడంతో గెలుపుపై కోల్‌కతా ఆశలు పెంచుకుంది. అయితే వీరిద్దరిని వరుస ఓవర్లలో పంజాబ్ బౌలర్లు పెవిలియన్ పంపించడం, ఆ వెంటనే వర్షం రావడంతో కోల్‌కతాకు నిరాశ తప్పలేదు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) గుర్బాజ్ (బి) సౌతీ 23; శిఖర్ ధావన్ (బి) వరుణ్ చక్రవర్తి 40; రాజపక్స (సి) రింకూ సింగ్ (బి) ఉమేశ్ 50; జితేశ్ శర్మ (సి) ఉమేశ్ (బి) సౌతీ 21; సికందర్ రజా (సి) నితీశ్ రాణా (బి) నరైన్ 16; స్యామ్ కరన్ (నాటౌట్) 26; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–23, 2–109, 3–135, 4–143, 5–168. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4–0–27–1, సౌతీ 4–0–54–2, సునీల్ నరైన్ 4–0–40–1, వరుణ్ చక్రవర్తి 4–0–26–1, శార్దుల్ ఠాకూర్ 4–0–43–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మన్దీప్ సింగ్ (సి) స్యామ్ కరన్ (బి) అర్‡్షదీప్ సింగ్ 2; గుర్బాజ్ (బి) ఎలిస్ 22; అనుకూల్ రాయ్ (సి) సికందర్ రజా (బి) అర్‡్షదీప్ సింగ్ 4; వెంకటేశ్ అయ్యర్ (సి) రాహుల్ చహర్ (బి) అర్‡్షదీప్ సింగ్ 34; నితీశ్ రాణా (సి) రాహుల్ చహర్ (బి) సికందర్ రజా 24; రింకూ సింగ్ (సి) సికందర్ రజా (బి) రాహుల్ చహర్ 4; ఆండ్రీ రసెల్ (సి) సికందర్ రజా (బి) స్యామ్ కరన్ 35; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 8; సునీల్ నరైన్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–13, 2–17, 3–29, 4–75, 5–80, 6–130, 7–138. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–38–1, అర్‡్షదీప్ సింగ్ 3–0–19–3, ఎలిస్ 3–0–27–1, సికందర్ రజా 3–0–25–1, రిషి ధావన్ 1–0–15–0, రాహుల్ చహర్ 2–0–12–1, హర్‌ప్రీత్ బ్రార్ 1–0–7–0. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X రాజస్తాన్ (మ. గం. 3:30 నుంచి) బెంగళూరు X ముంబై (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
Womens Asia Cup 2022: మేఘన మెరిసె...
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసింది. దీంతో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మేఘన, షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ మేఘన 38 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని అధిగమించడంతో భారత్ కేవలం 12 ఓవర్లలోనే 100 స్కోరు చేసింది. ఓపెనర్లిద్దరు 13.5 ఓవర్లలో 116 పరుగులు జోడించాక మలేసియా బౌలర్ వినిఫ్రెడ్ దురైసింగం బౌలింగ్‌లో మేఘన నిష్క్రమించింది. తర్వాత రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో భారత పరుగుల జోరు కొనసాగింది. నూర్ దానియా వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో షఫాలీ వర్మ, కిరణ్ నావ్‌గిరె (0) అవుటయ్యారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆట సాధ్యపడలేదు. తొలి ఓవర్లోనే వినిఫ్రెడ్ (0)ను దీప్తి శర్మ డకౌట్ చేసింది. నాలుగో ఓవర్లో వాన్ జులియా (1)ను రాజేశ్వరి బౌల్డ్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా... 16 పరు గులే చేయడం వల్ల మలేసియా అమ్మాయిలు 30 పరుగుల తేడాతో ఓడారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన భారత జట్టు నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో ఆడుతుంది. -
ఇలాంటి మ్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్
నేపియర్: న్యూజిలాండ్‌తో రెండో టి20లో ఛేదనకు బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. కానీ ఎన్ని పరుగులు చేస్తే గెలుస్తామో తెలీదు! దానిపై స్పష్టత లేకుండానే అంపైర్లు ఆట మొదలు పెట్టేశారు. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో మైదానంలోని పెద్ద స్క్రీన్‌పై, కివీస్ అధికారిక ట్విట్టర్లో 16 ఓవర్లలో 148గా చూపించారు. 9 బంతులు పడిన తర్వాత హడావిడిగా మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో కంప్యూటర్‌తో కుస్తీ పట్టి డక్‌వర్త్ లూయిస్ లెక్క ప్రకారం లక్ష్యాన్ని 16 ఓవర్లలో 170గా తేల్చాడు. ఆ వెంటనే కాదు కాదు అంటూ నాలుక్కర్చుకొని చివరకు 171 పరుగులుగా ఖరారు చేశారు! ‘డక్‌వర్త్’ ఎంత గందరగోళమో, చివరకు మ్యాచ్ రిఫరీలకు కూడా అర్థం కానిదని ఈ ఘటన నిరూపించింది. సాధారణ వర్ష సూచన ఉన్నప్పుడు ఓవర్లు, వికెట్ల ప్రకారం చేయాల్సిన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఇన్నింగ్స్ విరామం మధ్యలో ఇరు జట్లకు ఒక షీట్‌ను అందిస్తారు. సరిగ్గా లెక్క చేయలేక వాటిని ఇవ్వకపోవడంతో ఇదంతా జరిగి నిర్వహణా లోపాన్ని చూపించింది. చివరకు జెఫ్ క్రో ఇరు జట్లకు క్షమాపణలు చెప్పుకున్నాడు! ఈ మ్యాచ్‌లో కివీస్ 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గి 2–0తో సిరీస్ దక్కించుకుంది. ముుందుగా కివీస్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. వర్షం రావడంతో ఇన్నింగ్స్‌ను ముగించారు. ఫిలిప్స్ (58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (34 నాటౌట్ ; 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. చదవండి: (క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ...) (ఐపీఎల్ 2021: పంజాబ్ పదునెంత?) -
తొలి టి20 న్యూజిలాండ్‌దే
ఆక్లాండ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో) విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (37 బంతుల్లో 75 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఫాబియాన్ అలెన్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రూ ఫ్లెచర్ (14 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లాకీ ఫెర్గూసన్ (5/21) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం వర్షం కారణంగా కివీస్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 176గా నిర్దేశించారు. అరంగేట్ర ఆటగాడు డెవాన్ కాన్వే (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జిమ్మీ నీషమ్ (24 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్ సాన్‌ట్నర్ (18 బంతుల్లో 31 నాటౌట్; 3 సిక్సర్లు) చివర్లో విజృంభించడంతో న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసి గెలుపొందింది. -
డీఎల్ఎస్ సూత్రధారి లూయిస్ ఇక లేరు!
లండన్: టోనీ లూయిస్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ క్రికెట్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి అంటే తెలియని వారుండరు. క్రికెట్‌కు బాగా అక్కరకొచ్చే ‘డక్‌వర్త్ లూయిస్ పద్ధతి’ (డీఎల్ఎస్) సూత్రధారుల్లో టోనీ ఒకరు. మ్యాచ్ ప్రతికూల పరిస్థితుల్లో ఆగిపోతే ఈ డక్‌వర్త్ లూయిస్ పద్ధతినే అనుసరించి విజేతను తేలుస్తారు. వర్షంతో ఆగి... సాగే మ్యాచ్‌లకు విజేతను తేల్చే పద్ధతిని కనిపెట్టిన గణాంక నిపుణుల్లో ఒకరైన ఇప్పుడు లూయిస్ కన్నుమూశారు. 78 ఏళ్ల టోనీ లూయిస్ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఓ యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్ అయిన టోనీ లూయిస్, మరో గణాంక నిపుణుడు ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలిసి ఓ లెక్క తెచ్చారు. ఓవర్లు, పరుగులు, వికెట్లు, రన్‌రేట్, తాజా పరిస్థితి అన్నింటిని లెక్కలోకి తీసుకొని ఓ సారుప్య నిష్పత్తితో గణాంకాలను ఆవిష్కరించారు. ఇది వర్షంతో మధ్యలోనే ఆగిపోయిన, ఆగి సాగిన ఎన్నో మ్యాచ్‌లకు ఫలితాన్నిచ్చింది. లూయిస్ సాగించిన శోధనలకు, సాధించిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎంబీఈ’ (మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్) పురస్కారంతో సత్కరించింది. డీఎల్ఎస్ రాకముందు అర్ధంతరంగా ఆగే మ్యాచ్‌ల కోసం ఓ మూస పద్ధతిని అవలంభించేవారు. అప్పటి దాకా ఆడిన ఓవర్లలో అత్యధిక సగటు పరుగుల లెక్కతో విజేతను తేల్చడమో... లక్ష్యాన్ని నిర్దేశించడమో జరిగేది. 1992లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన అప్పటి విధానం పెను విమర్శలకు దారితీసింది. దీంతో మెరుగైన కొత్త పద్ధతి కోసం ఐసీసీ అన్వేషించగా... డక్‌వర్త్, లూయిస్ ఇద్దరు కలిసి రూపొందించిన పద్ధతి ఐసీసీని మెప్పించింది. దీంతో వారిద్దరి పేర్లతోనే డీఎల్ సిస్టమ్‌గా 1997 జనవరి 1నుంచి అమలు చేశారు. నిజానికి ఇదేమీ తేలిగ్గా అర్థమవదు. అయితే పాత పద్ధతి కంటే మేలైనది కావడంతో ఐసీసీకి డీఎల్ఎస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం కనపడలేదు. తదనంతర కాలంలో ఈ పద్ధతికి ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ మెరుగులు దిద్దడంతో అతని పేరు కూడా కలిపి 2014నుంచి డక్‌వర్త్–లూయిస్–స్టెర్న్ (డీఎల్ఎస్)గా వ్యవహరిస్తున్నారు. -
ఛే‘దంచేశారు’
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను టీమిండియా అజేయంగా ముగించింది. కెప్టెన్ కోహ్లి (99 బంతుల్లో 114 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీకి తోడు అయ్యర్ (41 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ కదంతొక్కడంతో బుధవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో భారత లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 35 ఓవర్లలో 255గా నిర్దేశించారు. దీనిని కోహ్లి సేన 32.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. అంతకు ముందు విం డీస్ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్ గేల్ (41 బంతుల్లో 72; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఎవిన్ లూయిస్ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటైన ఇన్నింగ్స్‌కు చివర్లో నికొలస్ పూరన్ (16 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో ప్రత్యర్థి మంచి స్కోరు చేసింది. అనంతరం డ/లూ ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని సవరించారు. రెండు వరుస సెంచరీలతో చెలరేగిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి. ఈ నెల 22 నుంచి నార్త్‌సౌండ్‌లో తొలి టెస్టు జరుగుతుంది. ధావన్ ఆడాడోచ్... ఓవర్‌కు దాదాపు 7 పరుగుల రన్‌రేట్, పైగా మధ్యలో వర్షం అడ్డుతగిలితే సమీకరణం క్లిష్టమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓపెనర్ రోహిత్ శర్మ (10) భారత ఛేదనను ధాటిగా ప్రారంభించాడు. రోచ్ వేసిన ఇన్నింగ్ తొలి రెండు బంతులను బౌండరీలు బాదాడు. మరుసటి ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (36 బంతుల్లో 36; 5 ఫోర్లు) సైతం రెండు వరుస ఫోర్లు కొట్టాడు. మూడో ఓవర్లో పరుగుకు యత్నించిన రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ధావన్–కోహ్లి మూడో వికెట్‌కు 58 బంతుల్లోనే 76 పరుగులు జోడించి చక్కదిద్దారు. ఈ స్థితిలో స్పిన్నర్ ఫాబియాన్ అలెన్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కలవరపెట్టాడు. తొలుత ధావన్ షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో కీమో పాల్‌కు క్యాచ్ ఇవ్వగా, అదే రీతిలో ఆడబోయిన పంత్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ‘అయ్యారె’ కోహ్లి భారత ఛేదనలో చక్కటి స్ట్రయిక్ రొటేషన్, అవసరానికి తగ్గట్లు పరుగులు తీస్తూ, వీలు చూసుకుని భారీ షాట్లు కొడుతూ సాగిన కోహ్లి, అయ్యర్ ఇన్నింగ్స్‌లే హైలైట్. ధావన్ పెవిలియన్ చేరినప్పటికి జట్టు స్కోరు 92/3. మరో 134 బంతుల్లో 163 పరుగులు చేయాలి. సాధించాల్సిన రన్ రేట్ 7.4. అటు పిచ్ నెమ్మదిస్తోంది. కానీ, కోహ్లి–అయ్యర్‌కు ఇవేవీ ప్రతిబంధకం కాలేదు. తమ భాగస్వామ్యంలో మూడు ఓవర్ల పాటు వీరు సంయమనం చూపారు. ఎదుర్కొన్న తొలి 11 బంతుల్లో 5 పరుగులే చేసిన అయ్యర్... అలెన్ బౌలింగ్‌లో ఫోర్‌తో ధాటిని పెంచాడు. చేజ్ ఓవర్లో ఫోర్ కొట్టిన కోహ్లి 48 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. అయితే, అలెన్, చేజ్ ఓవర్లలో 5 బంతుల వ్యవధిలో 3 సిక్స్‌లు బాది అయ్యర్ పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. అప్పటినుంచి ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ లేదంటే సిక్స్‌తో సాగిన వీరి జోరుకు అడ్డే లేకుండా పోయింది. కోహ్లిని మించిన వేగం చూపిన అయ్యర్... పాల్ ఓవర్లో ఫోర్‌తో వరుసగా రెండో అర్ధ సెంచరీ (33 బంతుల్లో) సాధించాడు. 8 వన్డేల కెరీర్లో అతడికిది నాలుగో అర్ధసెంచరీ కావడం విశేషం. చేజ్ ఓవర్లో మరో సిక్స్ బాది చెలరేగిపోతున్న అయ్యర్... రోచ్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి లాంగాఫ్‌లో హోల్డర్‌కు చిక్కాడు. కానీ, అప్పటికే లక్ష్యం 41 బంతుల్లో 43గా మారి భారత్ విజయం తేలికైపోయింది. కోహ్లి–అయ్యర్ నాలుగో వికెట్‌కు 94 బంతుల్లోనే 120 పరుగుల జోడించారు. రోచ్ ఓవర్లో సింగిల్‌తో కోహ్లి 43వ వన్డే సెంచరీ (94 బంతుల్లో) సాధించాడు. సమయోచితంగా ఆడిన జాదవ్ (12 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్, సిక్స్)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. 12 పరుగుల వద్ద హోప్ క్లిష్టమైన క్యాచ్ వదిలేయడంతో కోహ్లికి లైఫ్ లభించింది. -
అఫ్గానిస్తాన్‌దే సిరీస్
ఎడిన్బర్గ్: పరుగుల ప్రవాహానికి వర్షం అడ్డుపడిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతిలో రెండు పరుగుల తేడాతో స్కాట్లాండ్పై గెలిచింది. రెండు వన్డేల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. ముందుగా స్కాట్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. మెక్లియోడ్ (100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అఫ్గాన్ బౌలర్లలో నైబ్ 3, అఫ్తాబ్, హమీద్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత అఫ్గానిస్తాన్ వర్షంతో ఆటనిలిచే సమయానికి 44.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రహ్మత్ షా (115 బంతుల్లో 113; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక్కొట్టాడు. అనంతరం మ్యాచ్ కొనసాగకపోవడంతో అఫ్గాన్ డీఎల్ ప్రకారం 2 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. తొలి వన్డే వర్షంతో రద్దయింది. -
ఆ పద్ధతి ఏంటో అర్థం కావట్లేదు..
సాక్షి, రాంచీ: డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ఏమిటో ఇప్పటికి అర్థం కావట్లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 9 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం కలిసొచ్చింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ఏంటో ఇప్పటికి అర్థం కావడం లేదు. ఆసీస్‌ను 118కే కట్టడి చేశాం. మా టార్గెట్ 40కి అటు ఇటుగా ఉంటుందనుకున్నాము. కానీ గమ్మత్తుగా 48 అయింది. ఈ గెలుపు ఆటగాళ్ల సమిష్టి కృషి. మేనేజ్మెంట్ సాయం మరవలేనిది. ఫార్మట్‌కు దగ్గట్టు ఆటగాళ్లను ఎంపిక చేయడం. ముఖ్యంగా యువ స్పిన్నర్ల ఎంపిక ధైర్యాన్నిచ్చింది. ఒక మ్యాచ్‌లో పరుగులిచ్చినా, వారు తిరిగి విజృంభించారు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లో భువనేశ్వర్, బుమ్రాలు బ్రిలియంట్ బౌలర్లు. యార్కర్లు, స్లో బంతుల వేసినపుడే బౌలర్ల నైపుణ్యం తెలుస్తోంది. ఈ విషయంలో ఈ పేస్ బౌలర్లు విజయవంతమయ్యారు.’ అని కోహ్లి తెలిపారు. ఇక శిఖర్ ధావన్ పునరాగమనంపై హర్షం వ్యక్తం చేసిన కోహ్లి.. దురదృష్టవశాత్తు కొన్ని మ్యాచ్‌లకు ధావన్ దూరమయ్యాడు. జట్టులోకి రావడం.. ఈ ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేయండం ధైర్యాన్నిచ్చిందని కోహ్లి పేర్కొన్నారు. ఆసీస్18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 118 పరుగుల వద్ద వర్షంతో ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటల అంతరాయం తర్వాత భారత్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన భారత్ 5.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (14 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా డక్‌వర్త్ లూయిస్ మాకే కాదు.. ఐసీసీకి కూడా అర్థం కాదని గతంలో వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. -
భారత్‌తోనే తేల్చుకుంటాం
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో వాన మరో మ్యాచ్‌ను అసంపూర్ణంగానే ముగించింది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతే తేల్చింది. డీఎల్ ప్రకారం పాక్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షంతో ఆటనిలిచే సమయానికి పాకిస్తాన్ 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఓపెనర్ ఫకర్ జమాన్ (31), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ (31 నాటౌట్) కాస్త మెరుగ్గా ఆడటం ‘డక్‌వర్త్’ లెక్కలకు పనికొచ్చింది. ఈ పద్ధతిలో 27 ఓవర్లకు 101 పరుగులు చేస్తే చాలు... అయితే పాక్ ఇంకా 19 పరుగులు ముందంజలోనే ఉండటం, వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో పాక్ విజయం ఖాయమైంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధారణ ఆటతీరుతో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా.. భారత్‌తో జరిగే చివరిలీగ్ మ్యాచ్‌లో తమ ప్రత్యేకత చూపిస్తామని ఆజట్టు పేసర్ మోర్నీ మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం భారత్‌తో జరిగే పోరు తమకు చాలా కీలకమని, ఆ జట్టుపై గెలుపొందేందుకు టీమంతా సమిష్టి ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో నిరాశజనక ఆటతీరు ప్రదర్శించిన తాము, భారత్‌తో మ్యాచ్‌లో తప్పకుండా అసాధరణ ఆటతీరు ప్రదర్శిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఎనిమిది నెలలుగా జట్టులో తన స్థానంపై అనిశ్చితి నెలకొందని, అయితే బరిలోకి దిగిన ప్రతిసారి ఉత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించానని పేర్కొన్నాడు. మరోవైపు ప్రొటీస్ కోచ్ రసెల్ డొమింగో తన జట్టును వెనకేసుకొచ్చాడు. పాక్‌తో మ్యాచ్‌లో కెరీర్లో తొలిసారి మొదటి బంతికే డకౌటైన కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను సమర్థించాడు. కెరీర్లో చాలా మంది తొలి బంతికే వెనుదిరిగే సందర్భం వస్తుందని, అయితే ఏబీకి ఇది జరగడానికి 200 వన్డేలకుపైగా సమయం పట్టిందని పేర్కొన్నాడు. భారతో జరిగే మ్యాచ్‌లో ఏబీ నుంచి భారీ ప్రదర్శన ఆశిస్తున్నామని, జట్టుకు అవసరమైన వేళ ఏబీ తప్పకుండా రాణిస్తాడని రసెల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అయ్యో పాపం సఫారీ: దక్షిణాఫ్రికా దురదృష్టమో... ఈ వాన వైపరీత్యమో కానీ... సఫారీ జయాపజయాల్ని ‘డక్‌వర్త్ లూయిస్’ కాలరాస్తోంది. గత 11 మ్యాచ్‌ల డీఎల్ ఫలితాల్లో 8 సార్లు జట్టు పరాజయాన్నే చవిచూసింది. 2015 నుంచి ఇప్పటి వరకు ‘డక్‌వర్త్’ తేల్చిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా గెలవలేకపోయింది. -
లంకకు వరుణుడి తోడు
టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 27 పరుగులతో వెస్టిండీస్‌పై గెలుపు ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి పగ తీరింది... లెక్క సరిపోయింది.... రెండేళ్ల క్రితం స్వదేశంలో ఫైనల్లో తమను ఓడించి టైటిల్‌కు దూరం చేసిన వెస్టిండీస్‌పై శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. జట్టంతా సమయోచితంగా రాణించడంతో పాటు... వరుణుడు సహకరించడంతో గత ఏడాది రన్నరప్ శ్రీలంక అలవోక విజయంతో టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. షేరే బంగ్లా స్టేడియంలో గురువారం జరిగిన తొలి సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌పై లంక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 27 పరుగులతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), దిల్షాన్ (39 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చినా... సంగక్కర (1), జయవర్ధనే (0) విఫలమయ్యారు. తిరిమన్నె (35 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూస్ (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో లంకకు గౌరప్రదమైన స్కోరు లభించింది. వరుస వికెట్లతో ఓ దశలో శ్రీలంక తడబడ్డా.. చివరి ఓవర్లలో మాథ్యూస్ అద్భుతంగా ఆడాడు. వెస్టిండీస్ జట్టు 13.5 ఓవర్లలో 4 వికెట్లకు 80 పరుగులు చేశాక భారీ వర్షం ముంచెత్తింది. స్మిత్ (14 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైంది. అయితే మలింగ ఐదు బంతుల వ్యవధిలో స్మిత్‌తో పాటు గేల్‌ను బౌల్డ్ చేశాడు. సిమ్మన్స్ (4) కూడా విఫలం కావడంతో విండీస్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శామ్యూల్స్ (29 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్), బ్రేవో (19 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. బ్రేవో అవుటై... స్యామీ క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే వడగళ్లతో కూడిన భారీవర్షం మొదలైంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అప్పటికీ విండీస్ గెలవాలంటే 108 (పార్ స్కోరు 107) పరుగులు చేయాలి. కానీ 80 పరుగులు మాత్రమే చేసింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (బి) సాంటోకీ 26; దిల్షాన్ రనౌట్ 39; జయవర్ధనే రనౌట్ 0; సంగక్కర (సి) అండ్ (బి) బద్రీ 1; తిరిమన్నె (సి) సిమ్మన్స్ (బి) సాంటోకీ 44; మాథ్యూస్ (సి) బ్రేవో (బి) రస్సెల్ 40; ప్రసన్న నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1-41; 2-41; 3-49; 4-91; 5-121; 6-160. బౌలింగ్: బద్రీ 4-0-23-1; సాంటోకీ 4-0-46-2; నరైన్ 4-0-20-0; శామ్యూల్స్ 4-0-23-0; రస్సెల్ 3-0-37-1; గేల్ 1-0-9-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (బి) మలింగ 17; క్రిస్ గేల్ (బి) మలింగ 3; సిమ్మన్స్ ఎల్బీడబ్ల్యు (బి) ప్రసన్న 4; శామ్యూల్స్ నాటౌట్ 18; డ్వేన్ బ్రేవో (సి) జయవర్ధనే (బి) కులశేఖర 30; స్యామీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (13.5 ఓవర్లలో 4 వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1-25; 2-28; 3-34; 4-77. బౌలింగ్: కులశేఖర 2.5-0-23-1; సేనానాయకే 2-0-6-0; మలింగ 2-0-5-2; హెరాత్ 4-0-27-0; ప్రసన్న 2-0-15-1; మాథ్యూస్ 1-0-4-0. షేమ్ షేమ్.. శ్రీలంక శ్రీలంక తమ కెప్టెన్ చండీమల్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం లేదని ప్రకటించింది. అతను టి20లకు సరిపోడట! అలాంటప్పుడు అతడిని జట్టుకు ఎంపిక చేయడం ఎందుకు? ఒకవేళ చేసినా... కెప్టెన్‌ను చేయాల్సిన అవసరం ఏమిటి? భవిష్యత్ కోసం అంటూ చండీమల్‌ను టీ20లకు కెప్టెన్‌ను చేశారు. కానీ దారుణంగా అవమానించారు. దీంతో అతను చాలా బాధపడ్డాడు. తాను మ్యాచ్ ఆడటం లేదని బుధవారం రాత్రి తెలియగానే భోరును విలపించాడట. లంక బోర్డుతో కాంట్రాక్టు వివాదం, సీనియర్ల మద్దతు లేకపోవడం వల్ల చండీమల్ అవమానం పాలయ్యాడు.