తొలి టి20 న్యూజిలాండ్‌దే | New Zealand beats West Indies by five wickets in first T20 | Sakshi
Sakshi News home page

తొలి టి20 న్యూజిలాండ్‌దే

Published Sat, Nov 28 2020 5:10 AM | Last Updated on Sat, Nov 28 2020 5:10 AM

New Zealand beats West Indies by five wickets in first T20 - Sakshi

ఆక్లాండ్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో) విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 16 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (37 బంతుల్లో 75 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఫాబియాన్‌ అలెన్‌ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఆండ్రూ ఫ్లెచర్‌ (14 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడారు.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లాకీ ఫెర్గూసన్‌ (5/21) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం వర్షం కారణంగా కివీస్‌ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 176గా నిర్దేశించారు. అరంగేట్ర ఆటగాడు డెవాన్‌ కాన్‌వే (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జిమ్మీ నీషమ్‌ (24 బంతుల్లో 48 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్‌ సాన్‌ట్నర్‌ (18 బంతుల్లో 31 నాటౌట్‌; 3 సిక్సర్లు) చివర్లో విజృంభించడంతో న్యూజిలాండ్‌ 15.2 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసి గెలుపొందింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement